రాధిక కేసులో వీడిన మిస్టరీ: కట్నం ఇచ్చుకోలేక, కన్నతండ్రే కత్తి దింపాడు

By Siva KodatiFirst Published Mar 2, 2020, 5:05 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన కరీంనగర్ రాధిక హత్య చేసును పోలీసులు ఛేదించారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపాలంటే బోల్డంత ఖర్చవుతుందని జడిసి కన్న తండ్రే ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన కరీంనగర్ రాధిక హత్య చేసును పోలీసులు ఛేదించారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపాలంటే బోల్డంత ఖర్చవుతుందని జడిసి కన్న తండ్రే ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

కరీంనగర్‌లోని విద్యానగర్‌లో ఫిబ్రవరి 10న జరిగిన రాధిక హత్య కేసులో ఎలాంటి క్లూలు లభించకపోవడంతో పాటు గతంలో బాధితురాలి ఇంట్లో అద్దెకు ఉన్న వారిని పోలీసులు అనుమానిస్తూ వచ్చారు.

Also Read:రాధిక హత్య మిస్టరీ... రంగంలోకి స్పెషల్ క్లూస్ టీం

ఎంతకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో సీపీ కమలాసన్ రెడ్డి కేసును సీరియస్‌గా తీసుకున్నారు. దొంగతనం జాడతో పాటు ఇంట్లో రక్తపు మరకలు కడిగిన గుర్తులు ఉండటంతో పోలీసులకు రాధిక తండ్రి కొమరయ్యపై అనుమానం కలిగింది.

కూతురి అంత్యక్రియలు జరిగే వరకు కొమరయ్యను వదిలేసిన పోలీసులు ఆ తర్వాత నిఘా పెడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా... తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నారు.

పోలియోతో బాధపడుతున్న తన బిడ్డకు ఇప్పటికే ఎంతో ఖర్చు చేసి వైద్యం చేయించానని, మళ్లీ పెళ్లి అంటే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయన్నాడు. దానికి భయపడే రాధికను చంపాలని నిర్ణయించుకున్నానని కొమరయ్య చెప్పాడు.

Also Read:అద్దెకున్న వారి పనా.. ప్రేమోన్మాది ఘాతుకమా: రాధిక హత్యపై వీడని మిస్టరీ

ఈ క్రమంలో ఫిబ్రవరి 10న రాధిక ముఖానికి బెడ్‌షీట్‌ను అడ్డుపెట్టి ఊపిరాడకుండా చేశానని చెప్పాడు. ఆ తర్వాత తనపై హత్యానేరం రాకుండా ఇంట్లో ఉన్న కత్తితో ఆమె గొంతు కోసి, రక్తపు మరకలను శుభ్రం చేసినట్లు తెలిపాడు.

దొంగతనం జరిగినట్లుగా చిత్రీకరించడానికి బీరువాలో ఉన్న మూడు తులాల బంగారాన్ని, డబ్బును మాచం చేసి దానికి అడ్డుగా మంచం పెట్టానని కొమరయ్య నేరం జరిగిన తీరును వెల్లడించాడు. సుమారు నెల రోజుల తర్వాత కేసు చిక్కుముడి వీడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

click me!