ఆమె ఇంట్లోంచి బయటకు రావడమే పాపం... పట్టపగలే నడిరోడ్డుపై...

Arun Kumar P   | Asianet News
Published : Feb 29, 2020, 03:50 PM IST
ఆమె ఇంట్లోంచి బయటకు రావడమే పాపం... పట్టపగలే నడిరోడ్డుపై...

సారాంశం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఒంటరి మహిళను టార్గెట్ గా చేసుకుని నడిరోడ్డుపైనే బంగారాన్ని దోచ్చుకున్నారు. 

కరీంనగర్: జగిత్యాల పట్టణంలో పట్టపగలే దోపిడీదొంగలు రెచ్చిపోయారు. రోడ్డుపై ఒంటరిగా కనిపించిన ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరీచేసి పరారయ్యారు. పట్టపగలే అదీ నడిరోడ్డుపై ఈ చైన్ స్నాంచింగ్ కు పాల్పడి జగిత్యాల పోలీసులకు సవాల్ విసిరారు. 

జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణి నగర్ లో దొంతుల సంధ్యారాణి అనే మహిళ  కిరాణ షాప్ నిర్వహిస్తోంది. అయితే ఆమె ఏదో పనిపై  ఇంట్లోంచి బయటకు రాగానే అక్కడే కాపుకాసిన చైన్ స్పాచర్లు తమ పని కానిచ్చేశారు. బైక్ పై ముసుగుల ధరించి వచ్చిన ఇద్దరు స్నాచర్లు ఆమె మెడలోని 32 గ్రాముల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యారు.

read more  తొమ్మిదేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్... నిందితుల్లో మైనర్ బాలుడు

పట్టపగలే ఇలా రోడ్డుపై బంగారు గొలుసు దొంగతనానికి గురవడంతో సంధ్యారాణి పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి సిసి కెమెరాల ఆధారంగా స్పాచర్లను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డుపై మహిళలు ఒంటరిగా వెళ్లేటపుడు జాగ్రత్తగా వుండాలని జగిత్యాల సిఐ జయేష్ రెడ్డి స్థానిక ప్రజలకు సూచించారు. 
 

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు