ఫుట్‌పాత్‌లపై ఉన్న వారి ఆకలి తీర్చేందుకు వినూత్న కార్యక్రమం

By Siva Kodati  |  First Published Oct 4, 2019, 2:44 PM IST

కరీంనగర్ మున్సిపాలిటీ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్కస్ గ్రౌండ్ పక్కన మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘‘ఫీడ్ ద నీడ్’’ అనే స్టాల్ ను మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం ప్రారంభించారు.


కరీంనగర్ మున్సిపాలిటీ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్కస్ గ్రౌండ్ పక్కన మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘‘ఫీడ్ ద నీడ్’’ అనే స్టాల్ ను మంత్రి గంగుల కమలాకర్ గురువారం ప్రారంభించారు.

కరీంనగర్ వచ్చే పేద ప్రజలు, రాత్రులు ఫుట్‌పాత్‌లపై నిద్రించే వాళ్లు, ఆకలితో ఉన్న వారి కోసం ఈ స్టాల్ ను ప్రారంభించారు.

Latest Videos

undefined

సహజంగా ఫంక్షన్లలో, హోటళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పారవేయకుండా నేరుగా మాకు అందజేస్తే ఆకలితో ఉన్నవారికి అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.

మిగిలిపోయిన అనగానే ఏదో వేస్ట్ కింద జమ కట్టకుండా ఇది ఎలాంటి ఎంగిలి కానీ పదార్థాలన్నారు. ఇక్కడ పేద, ధనిక భేదం లేకుండా ఆకలితో ఉన్న వారు ఎవరైనా తినవచ్చని, ఇలాంటివి నగరంలో మరిన్ని ప్రారంభించుటకు మంత్రి అధికారులకు తెలిపారు.

స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి స్థాల్‌ను నెలకొల్పితే మున్సిపల్ కార్పొరేషన్ కరెంటు బిల్లు తో పాటు మెయింటెనెన్స్ కూడా చేస్తుందని తెలిపారు.

click me!