బండి సంజయ్ కు షాక్... కరీంనగర్ లో పాగావేసిన టీఆర్ఎస్

By Arun Kumar PFirst Published Jan 27, 2020, 4:40 PM IST
Highlights

తెలంగాణలో ఇటీవల  వెలువడిన  మున్సిపల్ ఎన్నికల పలితాల్లో విజయడంకా మోగించిన అధికార టీఆర్ఎస్ పార్టీ తాజాగా కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో కూడా అదే జోరును కొనసాగించింది. 

కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపికి షాక్ తగిలింది. సోమవారం ఈ కార్పోరేషన్ ఎన్నికల  ఫలితం వెలువడింది. ఇందులో  టీఆర్ఎస్ 32, బిజెపి 12, ఎంఐఎం 5, ఇండిపెండెంట్లు 5 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అయితే కనీసం ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయింది. 

టీఆర్ఎస్ అభ్యర్థులు2,3,6,7,8,12,14,15,16,17,20,21,22,23,24,25,28,29,30,33,35,37,39,41,42,43,45,46,49,51,53,56,59, 60 బిజెపి 1,10,12, 13,26,32,36,38,44,48,55,57,58, ఎంఐఎం 4,5,34,27,52,47  ఇండిపెండెంట్ అభ్యర్థులు 11,09,18,19,40,50,54,31  డివిజన్లను కైవసం చేసుకున్నారు.  

రెండురోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడగా టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని అందుకుంది. దాదాపు 90 శాతం మున్సిపాలిటీల్లో విజయాన్ని అందుకోగా కార్పోరేషన్లలో అయితే వందకు వంద శాతం  గెలుపొందింది. టీఆర్ఎస్ కు గట్టి  పోటీనిస్తామన్న కాంగ్రెస్, బిజెపి  లు సింగిల్ డిజిట్ కే ఫరిమితమయ్యాయి.

read more  పనిచేయకుంటే పదవులు పోతాయి..గెలిచినోళ్లంతా యాదికుంచుకోండి: కేటీఆర్ వార్నింగ్‌ 

అయితే  నిజామాబాద్ కార్పోరేషన్ పరిధిలో మంచి ఫలితాన్నే రాబట్టిన కరీంనగర్ లో కూడా అలాంటి ఫలితమే వెలువడుతుందని ఆశించింది. అక్కడినుండి ఎంపీ బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో గెలుపుపై ఆశలు పెట్టుకుంది. అయితే మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల వ్యూహాల ముందు సంజయ్ ఎత్తులు పనిచేయలేవన్నది ఈ ఫలితం తెలుపుతోంది. 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిజెపిలో  ఆత్మవిశ్వాసం పెరిగింది. ఏకంగా నాలుగు పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అలాంటి ప్రదర్శననే ఆశించింది. కానీ పట్టణ ఓటర్లు మాత్రం అధికార టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపి బిజెపిని  ఘోరంగా ఓడించారు. 

read more  చేతులు కలిపిన కాంగ్రెస్, బిజెపి: 110 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం

ముఖ్యంగా కరీంనగర్ కార్పోరేషన్ లో ఓటమి అనేది బిజెపి పై కంటే ఎంపీ బండి సంజయ్ పై ఎక్కువ  ప్రభావం చూపనుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిజెపి గౌరవప్రదమైన స్థానాలు సాధిస్తుందని అనుకుంటుండగా కనీసం కరీంనగర్ పట్టణంలో కూడా గెలవలేక  పోవడం ఎంపీని ఇరకాటంలోకి నెట్టే అవకాశాలున్నాయి. ఇలా ఈ ఫలితం బిజెపికి షాకిచ్చింది అనేకంటే  బండి సంజయ్ కి షాకిచ్చింది అనవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

click me!