కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బొడిగె శోభ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ చౌక్ నుండి ఆర్ టి సి బస్ స్టాండ్ వరకు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు
కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బొడిగె శోభ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ చౌక్ నుండి ఆర్ టి సి బస్ స్టాండ్ వరకు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు.
అనంతరం ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద ఉద్యోగులు నిర్వహించిన వంటా వార్పులో కార్యక్రమంలో శోభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గత వారం రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల గురించి సమ్మె చేస్తుంటే మంత్రులకు పట్టడం లేదన్నారు.
undefined
ఎవరైనా దసరా సెలవులు 11 రోజులు ఇస్తారా అని ఆమె మండిపడ్డారు. విద్యార్ధులు ఆర్టీసీ సమ్మెకు మద్ధతు ఇస్తారనే భయంతోనే ప్రభుత్వం సెలవులు పొడిగించిందని శోభ ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి పోతుగంటి సుజాత రెడ్డి, బిజెపి నాయకురాలు శ్రీమతి బండ అనిత లు పాల్గొన్నారు .
మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యామ్నాయ బస్సుల ద్వారా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తోంది.
అయితే పలు చోట్ల తాత్కాలిక కండక్టర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో రవాణా శాఖ అప్రమత్తమైంది. కోరుట్లలోని పలు ఆర్టీసీ బస్సుల్లో జిల్లా రవాణా శాఖ అధికారి జి. కిషన్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
నిబంధనలకు విరుద్ధంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని..అలాగే ప్రయాణికులు కండక్టర్లకు అదనపు ఛార్జీలు చెల్లించొద్దని ఆయన సూచించారు.