మైనింగ్ కార్మికుల‌కు అండగా ఉంటాం: కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు

By Siva KodatiFirst Published Oct 1, 2019, 5:58 PM IST
Highlights

కార్మికుల పక్షాన తాము ఉంటామని, లేబర్ యాక్ట్ ఖచ్చితంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులను ఒప్పించి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని సత్యనారాయణ స్పష్టం చేశారు

మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులను కట్టం అంటే బ్లాక్‌మెయిలింగ్ అనడం ఎంతవరకు సమంజసమన్నారు కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సత్యనారాయణ. మైనింగ్ అధికారులు, పర్యావరణ అధికారులు, లేబర్ ఆఫీసర్ నిర్వహణ సక్రమంగా లేక ఇంత పెద్ద స్కాం జరిగిందని ఆయన ఆరోపించారు.

కేవలం ఎనిమిది క్వారీల యజమానులు మాత్రమే ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు ఎగవేశారని సత్యనారాయణ తెలిపారు. 2003 నుంచి ఎన్ని బ్లాకులు మైనింగ్ చేశారని, ఎంత ఎగుమతి చేశారని ఆయన ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడితో చెక్‌పోస్టులు తీసేశారని, యజమానులు చెప్పినట్లు అధికారులు చేస్తున్నారని సత్యనారాయణ ఎద్దేవా చేశారు.

8 క్వారీ యజమానులను ప్రభుత్వం పనులు కట్టమంటే మూడు వందల మంది పార్టీ యజమానులకు ఆపాదించడం మంచి పద్దతి కాదని ఆయన హితవు పలికారు. కార్మికుల పక్షాన తాము ఉంటామని, లేబర్ యాక్ట్ ఖచ్చితంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

అధికారులను ఒప్పించి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని సత్యనారాయణ స్పష్టం చేశారు. మరోవైపు సోమవారం నగరంలో జరిగిన గ్రానైట్ కటింగ్ లేబర్స్ కలెక్టరేట్ ముట్టడికి తమకు ఎలాంటి సంబంధం లేదని అసోసియేషన్ సభ్యులు రామంచ విష్ణువర్థన్ రెడ్డి స్పష్టం చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు రెండు అవసరమేనని. . కేవలం ఒక పార్టీకో, వర్గానికో సంబంధించినది కాదన్నారు. తమ యూనియన్‌కు చెందిన శంకరయ్య మా ప్రమేయం లేకుండా నిన్న ధర్నాలో పాల్గొన్నారని విష్ణువర్థన్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రతి కార్మికుడికి సంస్థలో భాగస్వామ్యం కల్పించి వారికి అండగా ఉంటామని ఆయన వెల్లడించారు. ర్యాలీలో పాల్గొన్న కొందరి కారణంగా కరీంనగర్ ఎంపీ బండీ సంజయ్ కుమార్‌కి క్షమాపణలు చెబుతున్నట్లు విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. తాము కార్మికుల కోసం పనిచేస్తామని వారిని రోడ్డు ఎక్కించి సమస్యలను మరింత జటిలం చేయ్యొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

click me!