సోషల్ మీడియాలో కథనాలు నమ్మొద్దు: జామాతే ఇస్లామి హింద్ నేత హమీద్

By Siva Kodati  |  First Published Oct 6, 2019, 3:50 PM IST

అపోహాలను నివృత్తి చేసేందుకు, సమాజంలో విరుద్దమైన మెస్సెజ్ లను అరికట్టేందుకు సద్బావన ఫోరం ఏర్పాటు చేశామని జమాతే ఇ ఇస్లామి హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా హమీద్ మహ్మద్ ఖాన్ తెలిపారు


అపోహాలను నివృత్తి చేసేందుకు, సమాజంలో విరుద్దమైన మెస్సెజ్ లను అరికట్టేందుకు సద్బావన ఫోరం ఏర్పాటు చేశామని జమాతే ఇ ఇస్లామి హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా హమీద్ మహ్మద్ ఖాన్ తెలిపారు.

కరీంనగర్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన కులమతాలకు అతీతంగా హిందు ముస్లీం, క్రైస్తవులు, సిక్కులను కలుపుకుని గ్రామాల్లో, బస్తీలలో తమ కార్యక్రమాలు ఉంటాయన్నారు.

Latest Videos

undefined

సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్న వాటిని నమ్మి మోసపోవద్దని, దుష్ర్పచారాన్ని ఆపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని హమీద్ కోరారు. ముందుగా మనం మనుషులం అనే భావనతో శాంతి సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.

రాజ్యాంగానికి విరుద్దంగా పనిచేస్తే ఏ రాజ్యం నిలువదని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, చట్టపరిధిలో పనిచేయాలని హమీద్ వెల్లడించారు. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే ఆరాచకానికి దారితీస్తుందని చట్టానికి లోబడి పనిచేయాలని మౌలానా హమీద్ పిలుపునిచ్చారు. 

click me!