నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు: ఎస్పీ సింధూశర్మ

Published : Dec 29, 2019, 07:53 PM ISTUpdated : Dec 29, 2019, 07:55 PM IST
నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు: ఎస్పీ సింధూశర్మ

సారాంశం

నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని.. అలాగే నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఙప్తి చేశారు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ

నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని.. అలాగే నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఙప్తి చేశారు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకునే  కార్యక్రమాలు రాత్రి 1 గంటల వరకు పూర్తి కావాలని తర్వాత కొనసాగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు.

Also Read:మంత్రి పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే నా ఓటు: కేటీఆర్

టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని డీజేలు నిషేధమని వాటిని  వినియోగిస్తే సీజ్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం, వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామని.. మోతాదుని బట్టి  జరిమానాలు, జైలు శిక్ష ఉంటుందన్నారు.

Also Read:హైదరాబాద్ నగర వాసులకు కోతుల బెడద నుండి శాశ్వత పరిష్కారం ఎప్పటికి దొరుకునో...?

ఇల్లు, ప్రవేట్ ఆస్తులపై, వీధి దీపాల పై రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టి న,వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సింధుశర్మ హెచ్చరించారు. 
 

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు