ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మార్గమధ్యంలో సిరిశేడు దగ్గర పోలీసులు మంత్రి హరీష్ రావు కారును ఆపి తనిఖీలు నిర్వహించారు
Huzurabad bypoll నేపథ్యంలో టీఆర్ఎస్ తరఫున పార్టీ ప్రచారానికి మంత్రి హరీశ్ రావు బయలుదేరారు. ఇల్లందకుంట మండలం వంతడుపుల, పాతర్లపల్లిల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
undefined
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మార్గమధ్యంలో సిరిశేడు దగ్గర పోలీసులు మంత్రి హరీష్ రావు కారును ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో మంత్రి హరీశ్ రావు.. కారులోంచి దిగి ఓ చెట్టు పక్కగా నిలబడి.. పోలీసులకు సహకరించారు. కారు తనిఖీల అనంతం మంత్రి ప్రచారానికి కదిలి వెళ్లిపోయారు.
సామాన్యుడిలా harishrao కారు తనిఖీకి సహకరించడం అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.