దిక్కు మొక్కు లేని మహిళ శవానికి వారే దిక్కై....

By telugu teamFirst Published Mar 29, 2020, 8:43 AM IST
Highlights

తెలంగాణలోని జగిత్యాలలో దిక్కు మొక్కు లేకుండా మరణించిన ఓ వృద్ధురాలికి వారే దిక్కై అంత్యక్రియలు నిర్వహించారు. హెల్పింగ్ హ్యాండ్ అనే సేవా సంస్థ కార్యకర్తలు ఆమెకు అంత్యక్రియలు చేశారు.

కరీంనగర్: జగిత్యాల జిల్లా కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఈ నెల 7వ తేదీన ఒక గుర్తు తెలియని వృద్ధురాలు దీనస్థితిలో ఉంది. అది గమనించిన స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షిణించి 14వ తేదీన మృతి చెందింది.విషయం తెలుసుకున్న పోలీసులు పూర్తి వివరాలు కోసం మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.

పదిహేను రోజులు అయినప్పటికీ ఎవరు రాకపోవడంతో పోలీసులు అనాథ శవంగా నిర్దారించారు. కాగా సమాచారం అందుకున్న జగిత్యాల హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అనుమతి తీసుకొని మృతదేహాన్ని తీసుకెళ్లి అన్ని తామై మోతె స్మశానవాటికలో ఖననం చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు.

ఈ అంత్యక్రియలకు సంబంధించి జగిత్యాల పట్టణానికి చెందిన తుమ్మనపల్లి బాలక్రిష్ణ గారు 1000/- ఆర్థిక సాయం అందించి సేవా భావం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు డెక్క శ్రవణ్,సింగం భూమేష్,నల్ల సురేష్,సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

click me!