సెల్ టవర్ ఎక్కి రైతన్న నిరసన... దిగివచ్చిన అధికారులు

By Arun Kumar P  |  First Published Aug 12, 2020, 9:36 PM IST

తనకు న్యాయం చేయాలంటూ ఓ రైతు సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగిన సంఘటన హుజురాబాద్ లో చోటు చేసుకుంది. 


హుజురాబాద్: తనకు న్యాయం చేయాలంటూ ఓ రైతు సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగిన సంఘటన హుజురాబాద్ లో చోటు చేసుకుంది. రైతు నిరసనతో దిగివచ్చిన అధికారులు రెండు రోజుల్లో అతడికి సంబంధించిన పనులన్నీ చేసిపెడతామని హామీ ఇచ్చారు. దీంతో సదరు రైతు నిరసనను విరమించి టవర్ పై నుండి దిగాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆరెపల్లిలో బుధవారం గుంటి శ్రీనివాస్ అనే రైతు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తన వాటాకు వచ్చిన భూమిని తన పేరు మీద చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా చేయడంలేదంటూ వాపోయాడు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విన్నవించాడు. 

Latest Videos

undefined

read more   జగిత్యాలలో కారు భీభత్సం...ఓవర్ స్పీడ్ తో వెళుతూ మూడు పల్టీలు (వీడియో)

రైతు ఆందోళనపై సమాచారం అందుకున్న స్థలానికి చేరుకున్న తహసీల్దార్ సురేష్ కుమార్ రెండు మూడురోజుల్లో న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో అతను సెల్ టవర్ దిగాడు. దీంతో పోలీసులు అతడికి అదుపులో తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. 

click me!