మాస్కు లేకుండా బయటకు వస్తే... భార్యను తీసుకురమ్మంటున్న ఎస్సై: బాధితుడి ఆవేదన

By Arun Kumar P  |  First Published Aug 14, 2020, 12:38 PM IST

మాస్కు ధరించలేదన్న కారణంతో తన సెల్ ఫోన్ లాక్కోవడమే కాదు తన భార్యను పోలీస్ స్టేషన్ కు తీసుకురమ్మని స్థానిక ఎస్సై భయబ్రాంతులకు గురిచేస్తున్నాండంటూ ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 


సిరిసిల్ల: మాస్కు ధరించలేదన్న కారణంతో తన సెల్ ఫోన్ లాక్కోవడమే కాదు తన భార్యను పోలీస్ స్టేషన్ కు తీసుకురమ్మని స్థానిక ఎస్సై భయబ్రాంతులకు గురిచేస్తున్నాండంటూ ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వంగళ భాస్కర్ రాత్రి సమయంలో కిరాణా సరుకుల కోసం ఇంట్లోంచి బయటకు వచ్చాడు. అయితే ఇదే సమయంలో పెట్రోలింగ్ లో భాగంగా గ్రామానికి వచ్చిన స్థానిక ఎస్సై  మాస్కు ధరించకుండా బయటకు వచ్చాడంటూ యువకున్ని అడ్డుకున్నాడు. అతడి వద్ద నుండి మొబైల్ ఫోన్ లాక్కున్న ఎస్సై తర్వాతి రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చి తీసుకోవాలని సూచించాడు. 

Latest Videos

undefined

read more  అమీన్ పురా దుర్ఘటన: మరో బాలికపైనా లైంగిక అఘాయిత్యం

దీంతో తర్వాతి రోజు తన సెల్ ఫోన్ కోసం పోలీస్ స్టేషన్ కు వెళితే ఎస్సై దురుసుగా ప్రవర్తించాడని బాధితుడు వాపోయాడు. తాను భార్యతో నిత్యం గొడవపడుతున్నానని సమాచారం వుందని... అందువల్ల ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకువస్తే మొబైల్ ఇస్తానని బెదిరించాడని తెలిపాడు. అయితే భార్యాభర్తలమయిన తమ విషయం మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని చెప్పినా నీ భార్యను తీసుకువస్తేనే ఫోన్‌ ఇస్తానని ఎస్సై అన్నట్లు బాధితుడు వివరించాడు. 

ఇలా దాదాపు రెండు గంటలపాటు స్టేషన్ ఆవరణలో నిలుచోబెట్టారని అన్నాడు. ఆ తర్వాత తన సెల్ ఫోన్ ఇచ్చినా ఇక మీద స్టేషన్ చుట్టూ నిన్ను తిప్పించుకుంటానని బెదించాడని తెలిపాడు. ఇలా చిన్న తప్పిదానికి భయభ్రాంతులకు గురి చేసిన ఎస్సై నుంచి రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను కోరేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చినట్లు బాధితుడు తెలిపారు. 

 

click me!