అన్నదమ్ముల మధ్య కర్రల దాడి: పాత ఇంటి గొడవ, ఒకరి మృతి

Published : Aug 25, 2020, 12:36 PM ISTUpdated : Aug 25, 2020, 12:37 PM IST
అన్నదమ్ముల మధ్య కర్రల దాడి: పాత ఇంటి గొడవ, ఒకరి మృతి

సారాంశం

పాత ఇంటి విషయంలో సోదరుల మధ్య జరిగిన గొడవ కాస్తా కర్రల దాడికి దారి తీసింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగింది.

ధర్మపురి: పాత ఇంటి ఆస్తి గొడవల కారణంగా అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా కొట్లాటలకు దారి తీసింది. సోమవారం రాత్రి తీవ్రంగా మారి కర్రలతో దాడికి కారణమైంది. ఈ దాడిలో  షేక్ మసూమ్ 50 అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఏరియాఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆతను మరణించాడు. ఈ  సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోంతాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోంతాపూర్ గ్రామంలో పాత ఇంటి ఆస్తి గోడవలు కారణంగా అన్నదమ్ములమధ్య జరిగిన కర్రలతో దాడిలో మసూమ్  అనే వ్యక్తి తలకు తీవ్రంగా గాయాలుపాలై ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతూ మృతి చెందాడు.

పాత ఇంటి ఆస్తివిషయంలో గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య గొడవలు తరచు జరుగుతుండే వాని ఇదే తరహాలో సోమవారం అర్ధరాత్రి పెద్దగొడవ జరిగిందని దీనితో కర్రలతో మసూమ్ పై అన్నదమ్ములు వారి కొడుకులు దాడిచేసితలపై తీవ్రంగా కొట్టడంతో మసూమ్ చనిపోయిన సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. 

ధర్మపురి సి. ఐ.రామచంద్రరావు తెలిపిన వివరాలు ప్రకారం పాత ఇంటి విషయం లో అన్నదమ్ముల మధ్య జరిగిన గోడవకారనంగా మసూమ్ తలకు తీవ్రంగా గాయాలు కారణంగా ఆసుపత్రిలో చనిపోయాడని. 9 మందిపై కేసునమోదు చేసినట్లు తెలిపారు కేస్నమోదు అయినవారిలో అక్తర్,నాయిమ్,ఖసీం, లాల్ మహమ్మద్ తో పాటు మరికొంతమంది ఉన్నారని కేసుదర్యాఫ్తు చేస్తున్నట్లు సి.ఐ.తెలిపారు.

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు