కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత కోసం తీసుకువచ్చిన ఎన్నార్సీ వంటివాటిని వ్యతిరేకిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బిజెపి నేత మురళీధర్ రావు నిలదీశారు. BJP Leader Muralidhar Rao Open Challenge To TS CM KCR
కరీంనగర్: దేశ ఐక్యమత్యం కోసం ప్రజలు అందరూ సహకరిస్తే ఉంటే కేవలం కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయని బిజెప నేషనల్ జనరల్ సెక్రటరీ మురళీధర్ రావు అన్నారు. శనివారం కరీంనగర్ కు విచ్చేసిన ఆయన స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఆర్అండ్‌బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... బిజెపి ప్రభుత్వం పౌరసత్వ బిల్లు, నాగరికత చట్ట సవరణ విషయంలో స్పష్టంగానే ఉందని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలందరూ సమర్థిస్తున్నారని అన్నారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలందరూ ఆదరిస్తున్న వీటిపై ప్రతిపక్షాలు గొడవలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.
undefined
తెలంగాణలోని టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ పౌరసత్వ బిల్లుపై తమ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని మురళీధర్ రావు కోరారు. ద్వంద వైఖరిని వీడాలని... ఇలా వ్యవహరించడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు.
కాంగ్రెస్, ఎంఐఎం, టిఆర్ఎస్ లు వేరువేరు రాజకీయ పార్టీలయినా వారి మనోభావాలు, నడవడిక అంతా ఒక్కటేనని అన్నారు. వారంతా ముస్లిం మైనారిటీ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపించారు.
read more రాధిక దారుణ హత్య... బాధిత కుటుంబానికి ఎంపీ బండి సంజయ్ హామీ
భారత పౌరసత్వం ఇవ్వకూడదని వ్యతిరేకిస్తున్నా ప్రజలు ఎక్కడి వారో స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించారు. బౌద్ధులు, సిక్కులు, క్రిస్టియన్స్, పారసీలు, హిందువులు వీళ్లంతా ఇండియా వాళ్లు కాదా...? వీరిని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు.
దేశ భద్రత, ఐకమత్య కోసం అందరం భారతీయులం అనే భావనతో మెలగాలని... దీని కోసం అందరం ఐకమత్యంగా పౌరసత్వ బిల్లుకు అనుకూలంగా వ్యవహరించాలని సూచించారు. కేవలం పాక్ ముస్లింలకు భారత పౌరసత్వం కావాలని పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీశారు.
ఈనెల 26 నుండి తెలంగాణలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నార్సీ గురించి పూర్తి విషయాలు కూలంకుషంగా వివరిస్తామని అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను పెట్టిందని...వ్యవసాయ రంగాన్ని దేశంలో మొదటి స్థానంలో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు.
రవాణా కోసం ప్రత్యేక రైళ్లను రూపకల్పన చేస్తున్నామని... గతంలో ఏ ప్రభుత్వం చేయని ఈ పథకాన్ని రైతులకే అంకితం చేస్తామన్నారు. త్వరలో రైల్వే రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని.. దీనివల్ల రవాణా రంగం చాలా పురోగతి సాధిస్తుంది అన్నారు. గ్రామ గ్రామానికి, ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలని కార్యకర్తలకు మురళీధర్ రావు సూచించారు.