ఆరోగ్యం కోసం మాత్రల పంపిణీ... వికటించి పాఠశాలలోనే చిన్నారి మృతి

By Arun Kumar P  |  First Published Feb 10, 2020, 5:25 PM IST

చిన్నారులు ఆరోగ్యవంతంగా వుండేందుకు ప్రభుత్వం పంపిణీ చేసే నులిపురుగుల మాత్రలు వికటించి ఓ చిన్నారి మృత్యువాతపడ్డ విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో  చోటుచేసుకుంది. 


జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. నులిపుపురుగు నివారణ మాత్రలు వికటించి సహస్ర( 8 ) అనే బాలిక మృతి చెందింది. పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకున్న కొద్దిసేపటికే బాలిక  అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా  పోయింది. అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో బాలిక కుటుంబం దు:ఖంలో మునిగిపోయింది. 

ఈ మాత్రలు వేసుకున్న మరికొంతమంది విద్యార్థులు కూడా వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారందరిని దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి విద్యార్థులంతా క్షేమంగానే వున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos

undefined

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సంధర్బంగా  సోమవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో నులిపురుగుల మాత్రల పంపిణి కార్యక్రమం జరిగింది. పిల్లలు ఎదుగుదలకు నులిపురులు కారణం అవుతుంటాయి. వీటి కారణంగా చిన్నారులు ఎత్తు, బరువు పెరగకుండా, నీరసంగా ఉంటు అనారోగ్యంతో బాధపడుతుంటారు.   అందుకే ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు కడుపులోని నట్టలను, పురుగులను బయటకు పంపించేందుకు (అల్బెండాజోల్) నులి పురుగుల నివారణ మాత్రలు వేస్తుంటారు. 

చిన్నపిల్లల కడుపులో నులి పురుగుల నిర్మూలన మాత్రలు ఎంతో దోహదపడుతాయి. అందువల్ల ప్రతి విద్యార్థి విధిగా నట్టల నివారణ మాత్రలు వేస్తుంటారు.   విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో చక్కగా రానిస్తారని భావించిన ప్రభుత్వం ఉచితంగానే పాఠశాల విద్యార్థులకు నులిపురుగల నివారణ మాత్రలు వేస్తుంది. ఇవే మాత్రలు వికటించి చిన్నారి మృత్యువాతపడింది. 

 


 

click me!