తెలంగాణ రాష్ట్రంలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (works)గ్రేడ్-II పోస్టు కోసం మొత్తం 53 ఖాళీలను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 17 ఆగస్టు 2022 నుండి అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్, TSPSC తెలంగాణలో డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ కంట్రోల్ కింద డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (works) గ్రేడ్-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 17 ఆగస్టు 2022 నుండి అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తేదీలు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 17 ఆగస్టు 2022.
దరఖాస్తు చివరి తేదీ: 6 సెప్టెంబర్ 2022 సాయంత్రం 5 గంటల వరకు.
undefined
ఖాళీల వివరాలు
తెలంగాణ రాష్ట్రంలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (works)గ్రేడ్-II పోస్టు కోసం మొత్తం 53 ఖాళీలను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తుంది.
విద్యా అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలి లేదా ఏదైనా సమానమైన అర్హత పొంది ఉండాలి.
వయో పరిమితి
TSPSC పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 18 నుండి 44 సంవత్సరాల వయస్సు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు అందించబడుతుంది.
దరఖాస్తు ఫీజు
అభ్యర్థులందరికీ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, పరీక్ష ఫీజు రూ.120
సెలెక్షన్ ప్రక్రియ
అభ్యర్థులు వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా సెలెక్షన్ చేయబడతారు, ఈ సెలెక్షన్ డిసెంబర్ 2022లో నిర్వహించబడుతుంది.
అర్హత శాతం
అభ్యర్థుల సెలెక్షన్ కోసం అర్హత మార్కులు: OC, స్పొర్ట్స్ మెన్ & EWS 40%, BCలకు 35%, SC, STలు ఇంకా PH వారికి 30%.