బీటెక్ అర్హతతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ.

By Sandra Ashok Kumar  |  First Published Nov 12, 2020, 2:17 PM IST

శ‌వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు, యూనిట్ల‌లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్ర‌యినీ ఇంజినీర్‌, ఇత‌ర పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ (బీఈఎల్) ఇప్పటికే వీటికి సంబంధించి నోటిఫికేష‌న్లను విడుద‌ల చేసింది.
 


 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బి‌ఈ‌ఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 1059 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.

దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు, యూనిట్ల‌లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్ర‌యినీ ఇంజినీర్‌, ఇత‌ర పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ (బీఈఎల్) ఇప్పటికే వీటికి సంబంధించి నోటిఫికేష‌న్లను విడుద‌ల చేసింది.

Latest Videos

undefined

ఆస‌క్తి, అర్హ‌త గల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులు ఎక్కువగా బెంగళూరులో ఉన్నాయి. ఎక్స్‌పోర్ట్ మాన్యుఫాక్చ‌రింగ్ ఎస్‌బీయూ, ఐపీఎస్ఎస్ ప్రాజెక్ట్, బెంగ‌ళూరు యూనిట్ల‌లో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://bel-india.in/ చూడవచ్చు.


మొత్తం పోస్టుల ఖాళీలు : 1059
1. బెంగ‌ళూరు యూనిట్‌
ప్రాజెక్ట్ ఇంజినీర్- 118 
ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌-5
ట్ర‌యినీ ఇంజినీర్‌- 418
ట్రయినీ ఆఫీస‌ర్ (ఫైనాన్స్‌)- 8

also read 

2. ఎక్స్‌పోర్ట్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ ఎస్‌బీయూ
ట్రయినీ ఇంజినీర్‌- 100
ప్రాజెక్ట్ ఇంజినీర్‌-125

3. ఐపీఎస్ఎస్ ప్రాజెక్ట్‌ (బెంగ‌ళూరు)
ట్ర‌యినీ ఇంజినీర్‌-160

అర్హ‌త‌లు: పోస్టులను బట్టి బీఈ/ బీటెక్/ బీఎస్‌సి లేదా బీఆర్క్‌ స‌బ్జెక్టులో ఇంజినీరింగ్ చేసి ఉండాలి. ఫైనాన్స్ పోస్టుల‌కు ఎంబీఏ పూర్తిచేసి ఉండాలి. హెచ్ఆర్ పోస్టుల‌కు ఎంబీఏ లేదా ఎం‌డబల్యూ‌ఎస్ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
ఎంపిక చేసే విధానం: ‌రాత‌ప‌రీక్ష ద్వారా ఎంపికలు ఉంటాయి.
ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ట్రయినీ ఆఫీస‌ర్‌, ఇంజినీర్ పోస్టుల‌కు రూ.200, ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ పోస్ట‌ల‌కు రూ.500, ఎస్టీ, ఎస్సీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ: కొన్ని పోస్టులకు న‌వంబ‌ర్ 21, మరికొన్ని పోస్టులకు నవంబర్‌ 25 ఆఖరు తేదిగా నిర్ణయించారు.
అధికారిక వెబ్‌సైట్‌:https://bel-india.in/

click me!