డిగ్రీ, పీజీ అర్హతతో ముత్తూట్ ఫైనాన్స్ లో ఉద్యోగాలు.. ఒక్కరోజే అవకాశం..

By S Ashok KumarFirst Published Jan 26, 2021, 8:43 PM IST
Highlights

ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏ‌పి‌ఎస్‌ఎస్‌డి‌సి) ట్విట్టర్‌ ద్వారా  వెల్లడించింది. 

ప్రముఖ గోల్డ్ లోన్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్  ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏ‌పి‌ఎస్‌ఎస్‌డి‌సి) ట్విట్టర్‌ ద్వారా  వెల్లడించింది.

ఏ‌పి‌ఎస్‌ఎస్‌డి‌సి ఈ‌ సంస్థతో కలిసి ముత్తూట్ ఫైనాన్స్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. 27న జనవరి 2021న ఈ ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో జూనియర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్, ప్రొబెషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ పోస్టులని భర్తీ చేయనుంది. అయితే ఈ పోస్టులు ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే కేటాయిస్తారు. 

జనవరి 27న రిపోర్ట్ చేయాల్సిన సమయం: ఉదయం 9 గంటలు. ఇంటర్వ్యూ నిర్వహించే స్థలం: సంహిత డిగ్రీ కాలేజ్, తాడితోట, ఆర్‌టీసీ బస్‌స్టాప్ ఎదురుగా, రాజమండ్రి.

also read 

ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏ‌పి‌ఎస్‌ఎస్‌డి‌సి) అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో చూడవచ్చు.

మొత్తం ఉన్న ఖాళీలు- 60
వయస్సు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి..
ఖాళీ పోస్టులు: జూనియర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్, ప్రొబెషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్
విద్యార్హతలు: డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎం.కామ్
ఇతర అర్హతలు: కంప్యూటర్ నాలెడ్జ్, కమ్యూనికేషన్స్ స్కిల్స్ తప్పనిసరి. బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇండస్ట్రీలో సేల్స్, ఆపేరషన్స్‌లో అనుభవం కూడా ఉండాలి.
 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated Jan 26, 2021, 8:43 PM IST