రాత పరీక్ష లేకుండా ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగాలు‌..డిగ్రీ, బీటెక్‌ వారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

By S Ashok Kumar  |  First Published Dec 23, 2020, 3:31 PM IST

అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ (ఏ‌ఏ‌ఏ‌ఎల్)లో సూపర్‌వైజర్, మేనేజర్ & ఇతరుల పోస్టులకు నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 15న లేదా అంతకన్నా ముందులోగా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


భార‌త ప్ర‌భుత్వ విమాన‌యాన మంత్రిత్వ‌ శాఖ‌కు చెందిన అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ (ఏ‌ఏ‌ఏ‌ఎల్)లో సూపర్‌వైజర్, మేనేజర్ & ఇతరుల పోస్టులకు నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 15న లేదా అంతకన్నా ముందులోగా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియలో భాగంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్ధులకు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 జనవరి 15 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు http://www.airindia.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Latest Videos

undefined

మొత్తం ఖాళీలు: 24
పోస్టులు: హెడ్ ఇంజినీరింగ్‌, హెడ్ రెవెన్యూ మేనేజ్‌మెంట్‌, డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్ త‌దిత‌ర పోస్టులున్నాయి.
అర్హ‌త‌: పోస్టును బట్టి సంబంధిత స్పెష‌లైజేషన్‌లో ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా, గ్రాడ్యుయేష‌న్‌, బీటెక్‌(ఏరోనాటిక‌ల్‌/ మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్‌/ ఏవియానిక్స్‌), త‌త్స‌మాన ప‌రీక్ష‌, ఐసీడబ్ల్యూఏ/ ఐసీఏ/ ఐసీఎస్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
ఎంపిక చేసే విధానం: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్ధులకు ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు.

also read 
వ‌యసు: స‌ంబంధిత పోస్టును బట్టి అభ్య‌ర్థి వ‌యసు 35-59 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థుల‌కు నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌యసులో స‌డ‌లింపు ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.1500.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
అలియ‌న్స్ ఎయిర్, ప‌ర్స‌న‌ల్ డిపార్ట్‌మెంట్, 
అలియ‌న్స్ భ‌వ‌న్, డొమెస్టిక్ టెర్మిన‌ల్‌-1, 
ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌, న్యూదిల్లీ-110037.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 15 జనవరి 2021.
వెబ్‌సైట్‌:http://www.airindia.in/

click me!