LIC HFL Jobs: డిగ్రీ పాసయ్యారా..అయితే ఎల్ఐసీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం మీ కోసం..రూ. 50 వేల జీతం

By Krishna AdithyaFirst Published Aug 12, 2022, 1:00 AM IST
Highlights

బ్యాంకింగ్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాకింగేతర ఫైనాన్స్ సంస్థల్లో సైతం మంచి గ్రోత్ కనిపిస్తోంది. బ్యాంకింగ్ తరహాలోనే వేతనాలు అందిస్తున్నారు. ఆ కోవకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని LIC హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఒకటి. ఈ సంస్థ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. 

బ్యాంకు ఉద్యోగం పొందడమే మీ లక్ష్యమా, అయితే బ్యాంకింగ్ తరహాలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థగా బీమా రంగంలో అగ్ర స్థానంలో ఉన్న సంస్థ ఎల్ఐసీ, ఈ సంస్థ ఏర్పాటు చేసిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ అనే రుణ సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తోంది. బ్యాంకింగ్ రంగంలో ఏవిధంగా అయితే మీకు ఉద్యోగ భద్రత మంచి వేతనం లభిస్తాయో, ఎల్ఐసీలో సైతం అదే విధంగా ఉద్యోగ భద్రతతో పాటు, మంచి వేతనం, జీవన భృతి, రిటైర్మెంట్ అనంతరం బెనిఫిట్స్ లభిస్తాయి. 

తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్  80 అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆగస్టు 4 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు LIC అధికారిక వెబ్‌సైట్ lichousing.comలో ఆగస్టు 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఖాళీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. అసిస్టెంట్ పోస్టుకు రిక్రూట్‌మెంట్ ప్రాంతాల వారీగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు రిక్రూట్‌మెంట్ ఆల్ ఇండియా మెరిట్ ఆధారంగా ఉంటుంది.

అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కోసం రిక్రూట్‌మెంట్‌లో రెండు వర్గాలు ఉన్నాయి - DME, Other కేటగిరి. అందులో DME వర్గం అంటే అభ్యర్థులు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపిక చేయబడతారు. ఇతర కేటగిరీ కింద అభ్యర్థులను ఓపెన్ మార్కెట్ ద్వారా ఎంపిక చేస్తారు.

LIC HFL రిక్రూట్‌మెంట్ 2022 ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు చివరి తేదీ - 25 ఆగస్టు 2022
పరీక్ష తేదీ - సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో

LIC HFL రిక్రూట్‌మెంట్ 2022 అర్హత వివరాలు:
అసిస్టెంట్ - ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి 55% మార్కులతో గ్రాడ్యుయేట్
అసిస్టెంట్ మేనేజర్ - ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి 60% మార్కులతో గ్రాడ్యుయేట్

LIC HFL రిక్రూట్‌మెంట్ 2022 పే స్కేల్:
అసిస్టెంట్ – రూ 22,730/-
అసిస్టెంట్ మేనేజర్ – రూ 53,620/-

LIC HFL రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు రుసుము:
రూ.800/-

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆన్ లైన్ ద్వారా Apply చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.. 


LIC HFL రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు ప్రక్రియ:
స్టెప్-1 LIC అధికారిక వెబ్‌సైట్ lichousing.comని సందర్శించండి
స్టెప్-2 “RECRUITMENT OF ASSISTANTS/ ASSISTANT MANAGERS” లింక్‌పై క్లిక్ చేయండి
స్టెప్-3 New Registrationపై క్లిక్ చేయండి
స్టెప్-4 అభ్యర్థించిన సమాచారాన్ని పూరించండి
స్టెప్-5 దరఖాస్తు రుసుము చెల్లించి ఫారమ్‌ను సమర్పించండి.

click me!