టెన్త్, ఐటీఐ అర్హతతో రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు.. అప్లయ్‌ చేసుకోవడానికి క్లిక్ చేయండి..

By asianet news telugu  |  First Published Jun 9, 2021, 7:14 PM IST

డీఎఫ్‌సీసీఐఎల్‌ (DFCCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1074 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ‌ నోటిఫికేషన్ ద్వారా 1074 జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటీవ్ లు, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ తదితర పోస్టులను  భర్తీ చేయనున్నారు. 


భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( డి‌ఎఫ్‌సి‌సి‌ఐ‌ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ‌ నోటిఫికేషన్ ద్వారా 1074 జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటీవ్ లు, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ తదితర పోస్టులను  భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు సివిల్, ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్ తదితర విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://dfccil.com/ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.

Latest Videos

undefined


విద్యార్హతలు:
1. జూనియర్ మేనేజర్: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, కంట్రోల్ మాన్యుఫాక్చర్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవడానికి  అర్హులు.  అలాగే ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం ఉంటుంది.  అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

also read 

2. ఎగ్జిక్యూటివ్: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, పవర్ సప్లయ్‌/అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాల్లో డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.30 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.


3. జూనియర్ ఎగ్జిక్యూటివ్: టెన్త్, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి వేతనం రూ. 25 వేల నుంచి రూ. 68 వేల వరకు చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

 
ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌/ఇంటర్వ్యూ ఆధారంగా  ఎంపికలు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరితేది: 23 జులై 2021

కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష తేది: 2021- సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో నిర్వహించనున్నారు.

అధికారిక వెబ్‌సైట్‌:https://dfccil.com/
 

click me!