10వ తరగతి అర్హత ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ధరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ల్ చేయండి..

By S Ashok Kumar  |  First Published Mar 2, 2021, 7:21 PM IST

 భార‌త ప్ర‌భుత్వ ప‌ర్స‌న‌ల్‌, ప‌బ్లిక్ గ్రీవెన్సెస్, పెన్ష‌న్స్ మంత్రిత్వ‌శాఖ ప‌ర్స‌న‌ల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌ (ఎస్ఎస్‌సీ) పలు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నది. 


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవర్త. భార‌త ప్ర‌భుత్వ ప‌ర్స‌న‌ల్‌, ప‌బ్లిక్ గ్రీవెన్సెస్, పెన్ష‌న్స్ మంత్రిత్వ‌శాఖ ప‌ర్స‌న‌ల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌ (ఎస్ఎస్‌సీ) పలు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నది.  

ఇందుకు 10వ తరగతి అర్హత ఉన్నవారు ఈ  ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 21 దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది.

Latest Videos

undefined

అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్  https://ssc.nic.in/లో చూడవచ్చు.  అయితే మొత్తం ఖాళీల‌కు సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లో వెల్లడించనున్నారు.

అర్హ‌త‌: గుర్తింపు పొందిన  ఏదైనా బోర్డు నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి‌.

వ‌య‌సు: వివిధ విభాగాల‌ను అనుస‌రించి 01.01.2021 నాటికి 18-25 ఏళ్లు, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సి/ ఎస్‌టిల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ య‌వ‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక చేసే విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ రాత ప‌రీక్ష (పేప‌ర్‌-1, పేప‌ర్‌-2) ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

also read 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 05 ఫిబ్రవరి 2021.

ద‌రఖాస్తుకు చివ‌రి తేది: 21 మార్చి 2021.

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేది: 23 మార్చి 2021.

చ‌లాన ద్వారా ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేది: 29 మార్చి 2021.

కంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామినేష‌న్ (టైర్‌-1): 01.07.2021 నుంచి 20.07.2021 వ‌ర‌కు.

టైర్‌-2 ప‌రీక్ష తేది (డిస్క్రిప్టివ్ పేప‌ర్): 21 నవంబర్‌ 2021.

అధికారిక వెబ్‌సైట్‌:https://ssc.nic.in/
 

click me!