Indian Bank Recruitment: ప‌ది పాసైన వారికి బంప‌రాఫ‌ర్‌.. ఆ బ్యాంక్‌లో ఉద్యోగాలు

By team teluguFirst Published Feb 23, 2022, 4:10 PM IST
Highlights

చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌.. ఇండియన్‌ బ్యాంక్‌ (Indian Bank) దేశ వ్యాప్తంగా పలు చోట్ల సెక్యూరిటీ గార్డు పోస్టు (Security Guard Posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌.. ఇండియన్‌ బ్యాంక్‌ (Indian Bank) దేశ వ్యాప్తంగా పలు చోట్ల సెక్యూరిటీ గార్డు పోస్టు (Security Guard Posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 202 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉన్న వాళ్లు అర్హులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 9 వరకు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకువెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య: 202
పోస్టుల వివరాలు: సెక్యూరిటీ గార్డులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 ఏళ్లకు మించకూడదు.
పే స్కేల్‌: నెలకు రూ.14,500ల నుంచి రూ.28,145ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆర్మీ/నేవీ/ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, లోకల్‌ ల్యాంగ్వేజ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: మొత్తం 40 మార్కులకు గానూ ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఆన్‌లైన్‌ పద్ధతిలో ఈ పరీక్ష జరుగుతుంది. 90 నిముషాల పాటు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 9, 2022.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:

Latest Videos

click me!