CISF Recruitment 2022: రూ.81,100 జీతంతో హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. అర్హ‌త‌లివే..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 16, 2022, 04:33 PM IST
CISF Recruitment 2022: రూ.81,100 జీతంతో హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. అర్హ‌త‌లివే..!

సారాంశం

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (GD) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. CISF ఈ నోటిఫికేషన్‌ ద్వారా 249 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. 

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (GD) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. CISF ఈ నోటిఫికేషన్‌ ద్వారా 249 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్ట్‌లను స్పోర్ట్స్‌ కోటా కింద భర్తీ చేస్తారు. అప్లయ్‌ చేయాలనుకునే అభ్యర్థులు CISF అధికారిక వెబ్‌సైట్ https://www.cisf.gov.in/ ద్వారా అప్లయ్‌ చేసుకోవచ్చు. 2022 మార్చి 31 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.cisf.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ప్రధాన అర్హతలివే

క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, హాకీ, హ్యాండ్ బాల్, జూడో, కబడ్డీ, షూటింగ్, స్విమ్మింగ్, వాలీ బాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, టైక్వాండో తదితర విభాగాల్లో ఉన్నాయి.
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు ఆడి ఉండటం అవసరం. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థికి దేశంలో లేదా విదేశాలలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వొచ్చు.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ సెలక్షన్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫలితాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,500 జీతం ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.cisf.gov.in/

PREV
click me!

Recommended Stories

Pilot: మీ పిల్ల‌ల్ని పైల‌ట్‌గా చూడాల‌నుకుంటున్నారా.. ఎంత ఖర్చవుతుంది.? ఏం చేయాలంటే..
Banking Jobs : అల్లాటప్పా బ్యాంకులో కాదు ఆర్బిఐలోనే జాబ్... ఈ అర్హతలుంటే మీదే