పదో తరగతి అర్హతతో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

By S Ashok KumarFirst Published Feb 2, 2021, 3:39 PM IST
Highlights

తెలంగాణ సర్కిల్‌లోని చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. 

భారత ప్రభుత్వ పోస్టల్ విభాగానికి చెందిన తెలంగాణ సర్కిల్‌లోని చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ  ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా  ఫిబ్రవరి 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత పూర్తి  సమాచారం కోసం  https://appost.in/ అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు.

మొత్త ఖాళీలు: 1150 ఇందులో  బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి.

అర్హత: లోకల్ లాంగ్వేజ్‌లో పదో తరగతి ఉత్తీర్ణత.  కనీసం 60 రోజుల శిక్షణా వ్యవధితో ఏదైనా కంప్యూటర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బేసిక్ కంప్యూటర్ ట్రెయినింగ్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి. 

వయసు: 27.01.2021 నాటికి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సి/ఎస్‌టిలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

also read డిగ్రీ అర్హతతో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ ...

ఎంపిక విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ తయారవుతుంది. ఉన్నత విద్యార్హతలకు అదనపు వెయిటేజ్ ఏమీ ఉండదు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఓసీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ పురుష/ ట్రాన్స్-మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళా/ ట్రాన్స్-విమెన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27 జనవరి 2021.

దరఖాస్తుకు చివరి తేది:  26 ఫిబ్రవరి 2021.

అధికారిక వెబ్‌సైట్:https://appost.in/

click me!