బ్యాంక్ క్లర్క్‌ల పోస్టుల కోసం IBPS రిక్రూట్‌మెంట్.. వేలల్లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే ?

By asianet news teluguFirst Published Jul 9, 2022, 5:52 PM IST
Highlights

 ఏదైనా స్ట్రీమ్ నుండి పట్టభద్రులైన అభ్యర్థులు అలాగే జూలై 1 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ రిక్రూట్‌మెంట్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.  జూలై 1 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ ప్రారంభంమై  చివరి తేదీ 21 జూలై 2022. 

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) వేల సంఖ్యలో క్లర్క్-XII పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న దాదాపు 6,035 క్లర్క్‌ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా స్ట్రీమ్ నుండి పట్టభద్రులైన అభ్యర్థులు అలాగే జూలై 1 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ రిక్రూట్‌మెంట్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.  జూలై 1 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ ప్రారంభంమై  చివరి తేదీ 21 జూలై 2022. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం, అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.  

 జీతం ఎంతంటే 
బ్యాంక్ క్లర్క్   బేసిక్ జీతం దాదాపు 18,000 ఇంకా అన్ని అలవెన్సులతో కలిపి దాదాపు రూ. 30,000 వరకు వస్తుంది. బ్యాంకు క్లర్క్  గరిష్ట బేసిక్ సాలరి సుమారు 48 వేలు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం పెరుగుతుంది. వివిధ బ్యాంకుల్లో క్లర్క్ జీతం వేర్వేరుగా ఉండవచ్చు  దయచేసి గమనించండి. అంతేకాకుండా వివిధ నగరాల ప్రకారం పే స్కేల్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది.

Latest Videos

ఏ బ్యాంకులలో  క్లర్క్‌గా అవకాశం
బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఫైనల్ గా ఎంపికైన అభ్యర్థులను ఆరు వేలకు పైగా పోస్టులకు IBPS రిక్రూట్ చేస్తోంది. ఇంకా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ & సింద్ బ్యాంక్ వంటి  పాపులర్ బ్యాంకులలో పని చేసే అవకాశం రావొచ్చు.

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కోసం కాల్ లెటర్‌ల డౌన్‌లోడ్: ఆగస్టు 2022

ప్రిలిమ్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: ఆగస్టు 2022

ఆన్‌లైన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్: సెప్టెంబర్ 2022

ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్ : సెప్టెంబర్/అక్టోబర్ 2022

మెయిన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ : సెప్టెంబర్/అక్టోబర్ 2022

ఆన్‌లైన్ మెయిన్స్ ఎగ్జామ్: అక్టోబర్ 2022

ప్రొవిజనల్ ఆలోట్మెంట్ : ఏప్రిల్ 2023

click me!