Nxt Wave: నెక్స్ట్ వేవ్ లో భారీగా పెట్టుబడులు.. యువతకు శిక్షణ కోసం రూ. 21 కోట్లు సేకరించిన స్టార్టప్

By team teluguFirst Published Dec 1, 2021, 8:40 PM IST
Highlights

Artificial Intelligence Training: హైదరాబాద్ లో ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ తో పాటు సైబర్‌ సెక్యూరిటీ, ఐవోటీ, ఫుల్‌ స్టాక్‌ వంటి కోర్సులలో యువతకు శిక్షణ ఇస్తున్న కోచింగ్ సంస్థలు అరుదుగా ఉన్నాయి. అందులో హైదరాబాద్‌కు చెందిన నెక్స్ట్‌వేవ్‌ (Nxt Wave) ఒకటి.

రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ఆర్టిపిషియల్ ఇంటలిజెన్స్ ది ప్రత్యేకస్థానం. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో రాణించడానికి టెకీలతో పాటు డిగ్రీ పట్టాదారులు కూడా దీనిపై దృష్టి సారిస్తున్నారు. హైదరాబాద్ లో ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ తో పాటు సైబర్‌ సెక్యూరిటీ, ఐవోటీ, ఫుల్‌ స్టాక్‌ వంటి కోర్సులలో యువతకు శిక్షణ ఇస్తున్న కోచింగ్ సంస్థలు అరుదుగా ఉన్నాయి. అందులో హైదరాబాద్‌కు చెందిన నెక్స్ట్‌వేవ్‌ (Nxt Wave) ఒకటి. ఈ సంస్థ.. పైన పేర్కొన్న టెక్నికల్ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నది. అయితే ఈ సంస్థలె  పెట్టుబడులు పెట్టేందుకు పలు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. 

తాజాగా.. నెక్స్ట్ వేవ్  4.0 టెక్నాలజీ రూ. 21 కోట్ల ఫండింగ్‌ సేకరించినట్టు ఆ సంస్థ సీఈవో రాహుల్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము యువతలో పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలను వెలికితీసి, వాటిని మెరుగుపరుచుకునేలా శిక్షణనిస్తామని పేర్కొన్నారు.

Latest Videos

ప్రస్తుత ప్రీ-సిరీస్‌-ఏ ఫండింగ్‌తో, నెక్స్ట్‌ వేవ్‌.. వచ్చే ఆరు నెలల్లో 30వేల మంది విద్యార్థులకు అడ్వాన్స్డ్‌ టెక్నాలజీస్‌లో శిక్షణ ఇవ్వబోతుందని రాహుల్ వెల్లడించారు. హైదరాబాద్ లోనే గాక టైర్‌-2, 3, 4 (చిన్న పట్టణాలు) పట్టణాలకు చెందిన విద్యార్థులపైనా నెక్స్ట్ వేవ్ దృష్టి సారించిందని, వారికీ శిక్షణ ఇచ్చేందుకు తాము సిద్ధమవుతున్నట్టు తెలిపారు.

ఒరియోస్‌ వెంచర్‌ పార్టనర్స్‌ నేతృత్వంలోని ప్రీ-సిరీస్‌-ఏ రౌండ్‌లో రూ. 20.9 కోట్ల ఫండింగ్‌ను నెక్స్ట్‌ వేవ్‌ కంపెనీ సేకరించిందని రాహుల్ తెలిపారు. ఈ రౌండ్‌లో వైభవ్‌-బెటర్‌ క్యాపిటల్‌తో పాటు ఏంజెల్‌ పెట్టుబడిదారులైన లివ్‌స్పేస్‌ రామకాంత్‌ శర్మ, షాదీ.కామ్‌ అనుపమ్‌ మిట్టల్‌, కార్డేఖో ఉమంగ్‌ కుమార్‌, బ్రైట్‌ చాంప్స్‌ రవి భూసాన్‌, కంట్రీడిలైట్‌కు చెందిన చక్రధర్‌ గాడే, మైత్రా ఎనర్జీ విక్రమ్‌ కైలాస్‌, జిఎస్‌ ఎఫ్‌ రాజేష్‌ సావ్నీ, మాల్పానీ గ్రూపు గిరిధర్‌ మల్పానీ, ఐఐఎఫ్‌ ఎల్‌ షాజీకుమార్‌ దేవకర్‌, కామన్‌ ఫ్లోర్‌ వికాస్‌ మల్పానీ, ఐఎస్‌బీఎల్‌ బీఎస్‌ ప్రొఫెసర్‌ నందకిశోర్‌ పాల్గొన్నారని తెలిపారు.

click me!