7784కు పైగా టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) పోస్టుల భర్తీ కోసం రైల్వే శాఖ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన విద్యార్హతలు, సిలబస్, ఇతర వివరాలు ఇలా వున్నాయి.
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా అయితే మీకో శుభవార్త. దాదాపు 7784కు పైగా టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) పోస్టుల భర్తీ కోసం రైల్వే శాఖ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆసక్తిగల అభ్యర్ధులు దేశంలోని 21 ఆర్ఆర్‌బీ అధికారిక పోర్టల్స్ నుంచి లేదా www.rrb.gov.in నుండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆర్ఆర్‌బీ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు చూస్తే . దరఖాస్తు ఫాం 30 రోజుల పాటు యాక్టీవ్‌గా వుండనుంది. ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హత 12వ తరగతి ఉత్తీర్ణత. గ్రూప్ సీ పోస్టుల ఖాళీల భర్తీ కోసం దరఖాస్తుదారుడు 10వ తరగతి పాస్ అయి వుండాలి. అభ్యర్ధుల వయసు 01.01.23 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వుండాలి. కనీసం వేతనం 5,200 - 20,200 ఇతర అలవెన్స్‌లు వుంటాయి.
ఎంపిక ప్రక్రియ :
1. కంప్యూటర్ బేస్డ్ వ్రాత పరీక్ష (సీబీఈ)
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (డీవీ)
3. మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (డీఎంఈ, ఆర్ఎంఈ)
అప్లికేషన్ ఫీజు :
జనరల్ అభ్యర్ధులకు రూ.500
ఎస్, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, వికలాంగులు, మహిళలు, మైనారిటీలు, ట్రాన్స్‌జెండర్లు, వెనుకబడిన తరగతుల అభ్యర్ధులకు రూ. 250
సిలబస్ :
కంప్యూటర్ బేస్ట్ టెస్ట్‌లో 100 మార్కులకు , 100 ప్రశ్నలు వుంటాయి. ఇందులో జనరల్ అవేర్‌నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్కులు వుంటాయి. మొత్తం 90 నిమిషాల పాటు పరీక్ష జరగనుంది. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్ చూడాల్సిందిగా మనవి.