ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.56 వేల జీతం.. వెంటనే అప్లయి చేసుకోండీ..

By S Ashok Kumar  |  First Published Dec 3, 2020, 4:09 PM IST

ప్రతి సంవత్సరం మే లేదా జూన్, డిసెంబరు నెలల్లో ఈ ప్రకటన వెలువడుతుంది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏ‌ఎఫ్‌సి‌ఏ‌టి) 01/2021 / ఎన్‌సి‌సి స్పెషల్ ఎంట్రీ ద్వారా ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ అండ్ నాన్-టెక్నికల్), ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లైయింగ్) తదితర విభాగాల్లో 235 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.


భారత వైమానిక దళం (ఐఎఎఫ్) పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్లలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్ (ఏ‌ఎఫ్‌సి‌ఏ‌టి) ప్రకటన విడుదల చేసింది. ప్రతి సంవత్సరం మే లేదా జూన్, డిసెంబరు నెలల్లో ఈ ప్రకటన వెలువడుతుంది.

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏ‌ఎఫ్‌సి‌ఏ‌టి) 01/2021 / ఎన్‌సి‌సి స్పెషల్ ఎంట్రీ ద్వారా ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ అండ్ నాన్-టెక్నికల్), ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లైయింగ్) తదితర విభాగాల్లో 235 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

Latest Videos

undefined

అర్హతగల పురుషులు, మహిళలు ఐ‌ఏ‌ఎఫ్ ఏ‌ఎఫ్‌సి‌ఏ‌టి 2021 కోసం డిసెంబర్ 01 నుండి 30 డిసెంబర్ 2020 లోగా ఏ‌ఎఫ్‌సి‌ఏ‌టి అధికారిక వెబ్‌సైట్ www.careerindianairforce.cdac.in లేదా www.afcat.cdac.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 235

ఖాళీలు ఉన్న విభాగాలు: ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్), ఎన్‌సి‌సి స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్)తదితర విభాగాల్లో ఉన్నాయి.

also read 

అర్హత: డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, బీకాం, డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ఎన్‌సీసీ సర్టిఫికెట్, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: ఫ్లైయింగ్ బ్రాంచు పోస్టులకు 1 జ‌న‌వ‌రి  2022 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. మిగిలిన వాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక:  ప్రవేశ పరీక్ష, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ), పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ పోస్టులకు రూ.250. మిగిలిన విభాగాలకు ఫీజు చెల్లించనవసరం లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 డిసెంబర్‌ 2020.

దరఖాస్తుకు చివరి తేది: 30 డిసెంబర్‌ 2020.

అధికారిక వెబ్‌సైట్: https://careerindianairforce.cdac.in/

click me!