ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో భారీగా ఉద్యోగాలు‌.. డిగ్రీ, బిటెక్ నిరుద్యోగులకు గొప్ప అవకాశం..

By S Ashok Kumar  |  First Published Dec 28, 2020, 6:49 PM IST

సైన్స్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్‌ టెస్ట్, సంబంధిత విభాగల పరీక్షల్లో అభ్యర్ధుల ప్రతిభ ఆధారంగా ఎంపికలు  ఉంటాయి. 


 ఎయిర్‌‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సైన్స్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్‌ టెస్ట్, సంబంధిత విభాగల పరీక్షల్లో అభ్యర్ధుల ప్రతిభ ఆధారంగా ఎంపికలు  ఉంటాయి.

ఈ పోస్టులకు ఎంపికైన వారికి  వార్షిక వేతనంగా  రూ.12 నుంచి 18 లక్షల వరకు పొందవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 368 పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో మేనేజర్, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

Latest Videos

undefined

మేనేజర్లకు రూ.60 వేలు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.40 వేల వేతనం ఇవ్వనున్నారు. అంతేకాకుండా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, వంటి ఇతర ప్రోత్సాహకాలు కూడా అదనంగా పొందవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి పోస్టు లేదా విభాగం బట్టి ఇంటర్వ్యూ లేదా ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ అండ్‌ ఎండ్యూరెన్స్‌ టెస్టు ఇంకా  డ్రైవింగ్‌ టెస్టు, వాయిస్‌ టెస్టు ఉంటాయి.

విభాగాల వారీగా ఉన్న మొత్తం ఖాళీలు: 368 
1. మేనేజర్‌ -13 (ఫైర్‌ సర్వీసెస్‌ 11, టెక్నికల్‌ 2)
అర్హత: మెకానికల్‌ లేదా ఆటోమొబైల్‌ విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణుత పొంది ఉండాలి‌. అలాగే ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో సంబంధిత విభాగంలో అయిదేళ్ల అనుభవం ఉండాలి.

also read 

2. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 
ఎయిర్‌‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ 264, 
ఏర్‌ పోర్టు ఆపరేషన్స్‌ 83, 
టెక్నికల్‌ 8 పోస్టులు ఉన్నాయి.

అర్హత: ఎయిర్‌‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగానికి మ్యాథ్స్, ఫిజిక్స్‌తో బీఎస్‌సి లేదా బీఈ/బీటెక్‌ (ఏదైనా సెమిస్టర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ తప్పనిసరి) ఎయిర్‌‌ పోర్టు ఆపరేషన్స్‌కు సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌తోపాటు ఎంబీఏ పూర్తిచేయాలి లేదా బీటెక్‌ చదివినవారై ఉండాలి. టెక్నికల్‌ ఖాళీలకు మెకానికల్‌ లేదా ఆటోమొబైల్‌లో బీఈ/బీటెక్‌ అర్హత ఉండాలి. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు అనుభవం అవసరం లేదు. అన్ని పోస్టులకు 60 శాతం మార్కులు తప్పనిసరి. చివరి సంవత్సరం కోర్సులు చదువున్నవారూ  కూడా అర్హులే.

వయసు: నవంబరు 30 నాటికి మేనేజర్లకు 32 ఏళ్లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు 27 ఏళ్లు మించకూడదు. దివ్యాంగులకు పదేళ్లు, ఎస్‌సి, ఎస్‌టిలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయసు సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం: మొదట ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నెగిటివ్‌ మార్కులు ఉండవు. పరీక్షలో వారి ప్రతిభతో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, తరువాత దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం ఇంటర్వ్యూ, దేహదారుడ్య పరీక్షలు, డ్రైవింగ్, వాయిస్‌ టెస్టు ఉంటాయి. వీటిలో అర్హత సాధించడం తప్పనిసరి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 15 డిసెంబరు నుంచి
దరఖాస్తులకు చివరి తేదీ: 14 జనవరి 2021
దరఖాస్తు ఫీజు: రూ.1000. మహిళలు, ఎస్‌సి, ఎస్‌టిలకు రూ.170
పరీక్ష తేదీ: త్వరలో ప్రకటించనున్నారు.
అధికారిక వెబ్‌సైట్‌:http://www.aai.aero/

click me!