తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

Published : Apr 06, 2023, 10:20 AM IST
తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..  గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

సారాంశం

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదలైంది. 

హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదలైంది. గురుకులాల్లో 9,231 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ప్రకటన చేసింది. మొత్తం 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 9,231 పోస్టుల్లో అత్యధికంగా 4020 టీజీటీ పోస్టులు ఉన్నాయి. 

నోటిఫికేషన్ల వారీగా వివిధ కేటగిరిల్లో ఖాళీలను పరిశీలిస్తే.. డిగ్రీ కాలేజ్‌ల్లో లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ల పోస్టులు 868, జూనియర్ కాలేజ్‌‌ల్లో లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు-2008, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్-1276, స్కూల్స్‌లో లైబ్రేరియన్ పోస్టులు-434, స్కూల్స్‌లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు- 275, డ్రాయింగ్ టీచర్స్/ఆర్ట్ టీచర్స్ పోస్టులు-134, క్రాప్ట్ ఇన్‌స్ట్రక్టర్స్/ క్రాఫ్ట్ టీచర్స్-92, మ్యూజిక్ టీచర్స్-124, టీజీటీ పోస్టులు-4,020 ఉన్నాయి. 

ఇంకా అభ్యర్థులు పూర్తి సమాచారం https://treirb.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీఆర్‌ఈఐ-ఆర్‌బీ కన్వీనర్ మల్లయ్య బట్టు తెలిపారు. ఈ నెల 12 నుంచి వన్‌టైమ్ రిజిస్టేషన్లు చేసుకోవచ్చని చెప్పారు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పూర్తి చేయడానికి, ఇతర ముఖ్యమైన తేదీల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
High Demand Jobs : లక్షల ఉద్యోగాలున్నా చేసేవారే లేరు.. జాబ్స్ లిస్ట్ ఇదే, ట్రై చేశారో లైఫ్ సెట్