ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఒపిఎస్సి) ఒడిశా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2019 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ A, గ్రూప్ B సర్వీసుల్లో మొత్తంగా 153 ఖాళీల భర్తీకి ఓపిఎస్‌సి నోటిఫికేషన్ జారి చేసింది.
న్యూ ఢిల్లీ : ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (OPSC) ఒడిశా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2019 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 13 2019 న ప్రారంభమై డిసెంబర్ 10 2019తో ముగుస్తుంది. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ ఫీజు డిసెంబర్ 16, 2019. గ్రూప్ A మరియు గ్రూప్ B సేవల్లో 153 ఖాళీల భర్తీకి OPSC అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
also read IBPS రిక్రూట్మెంట్ నోటీసును విడుదల: మొత్తం 1,163 ఖాళీలు
undefined
ఒక దరఖాస్తుదారుడు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడు ఓడియాను చదవటం, వ్రాయటం మరియు మాట్లాడటం వచ్చి ఉండాలి అలాగే మిడిల్ స్కూల్ ఎగ్జామినేషన్ లో ఓడియా భాషా సబ్జెక్టులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి.
వయోపరిమితి ప్రకారం, దరఖాస్తుదారుడు 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల తక్కువ వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఎస్‌ఇబిసి, మహిళలు, మాజీ సైనికులకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు అధిక వయోపరిమితి సడలింపు ఉంటుంది.
also read Indian navy jobs: ఇండియన్ నావిలో నావికుడి పోస్ట్ ఖాళీలు
అర్హతగల అభ్యర్థులు ఒడిశా సివిల్ సర్వీసెస్ పరీక్షకు OPSC వెబ్‌సైట్‌లో అందించబడే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు రుసుము రూ. 500. షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ ఒడిశాకు చెందిన అభ్యర్థులు, శాశ్వత వైకల్యం 40% కన్నా తక్కువ లేని వైకల్యం ఉన్నవారికి ఈ రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది.