RBI recruitment 2022: ఆర్‌బి‌ఐలో భారీగా ఉద్యోగాల భర్తీ.. ఎలా అప్లయ్ చేయాలో తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Feb 16, 2022, 12:09 PM IST
Highlights

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 17 ఫిబ్రవరి 2022 నుండి అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం  ఆన్‌లైన్ అప్లికేషన్ విండోను తెరవనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు rbi.org.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు .
 

 బ్యాంక్ రిక్రూట్‌మెంట్  కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు సువర్ణావకాశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం పూర్తి నోటిఫికేషన్ 17 ఫిబ్రవరి 2022న విడుదల చేయనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌ కోసం సిద్ధంగా ఉన్న అభ్యర్థులందరూ ఆర్‌బి‌ఐ అధికారిక వెబ్‌సైట్, rbi.org.inని సందర్శించడం ద్వారా నోటిఫికేషన్‌ను చెక్ చేయవచ్చు. 

ఆర్‌బి‌ఐ రిక్రూట్‌మెంట్ 2022 కోసం  దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 17 నుండి ప్రారంభమవుతాయి. దరఖాస్తుకు చివరి తేదీని మార్చి 8, 2022గా నిర్ణయించింది. అయితే దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహించబడుతుందని అభ్యర్థులు గమనించాలి. ఇతర మార్గాల ద్వారా దరఖాస్తులు ఆమోదించబడవు. వెబ్‌సైట్ చివరి నిమిషంలో ఓవర్‌లోడింగ్ కారణంగా టెక్నికల్ సమస్యలను నివారించడానికి అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి అని సూచించింది.

 పరీక్ష తేదీలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం 26, 27 ఫిబ్రవరి 2022 తేదీలలో వ్రాత పరీక్షను నిర్వహించనుంది. ఫేజ్-1, ఫేజ్-2 ఇంకా లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షకు రెండు నెలల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉందని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రేపరేషన్ వేగవంతం చేసుకోవాల్సి  ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 950 పోస్టులను భర్తీ చేయనున్నారు.

 విద్యా అర్హత అండ్ వయో పరిమితి
 ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీని పొంది  ఉండాలి. అంతేకాకుండా దరఖాస్తుదారులు కంప్యూటర్ (word processing) గురించి కూడా పరిజ్ఞానం కలిగి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు విద్యార్హతల్లో సడలింపు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు నోటిఫికేషన్‌ని చెక్ చేయవచ్చు. దరఖాస్తుదారుల వయోపరిమితి కనీసం 20 సంవత్సరాలు, గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి. 

 ఎలా దరఖాస్తు చేయాలి?
క్రింద ఇవ్వబడిన సులభమైన మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

1. ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rbi.org.in ని సందర్శించండి.

2. ఇప్పుడు హోమ్ పేజీలో కనిపించే అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయండి.

3. ఇప్పుడు మిమ్మల్ని కొత్త పేజీకి మళ్లిస్తుంది.

4. ఇక్కడ అడిగిన సమాచారాన్ని ఎంటర్ చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోండి. 

5. ఇప్పుడు మీ ఐ‌డి అండ్ పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి.

6. తరువాత అవసరమైన మొత్తం సమాచారాన్ని ఎంటర్ చేయడం ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.

7. చివరగా అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

8. ఇప్పుడు మీ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి తదుపరి అవసరాల కోసం  ప్రింట్ అవుట్ తీసుకోండి.

click me!