గతేడాది డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ కేడర్ పొందాడు. ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత మళ్లీ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి.. ఈ సారి మంచి ర్యాంకు సాధించగలగడం విశేషం. ఇప్పుడు ఐఏఎస్ అయ్యాడు.
యూపీఎస్సీ పరిక్షలో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడితే గానీ మంచి ర్యాంక్ సాధించలేరు. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ పరీక్షల్లో 90 వ ర్యాంకు సాధించిన ప్రఖర్ జైన్ కి ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే.. ప్రఖర్.. ఆ ర్యాంకు సాధించడానికి యూపీఎస్సీ పరీక్ష నాలుగు సార్లు రాయడం గమనార్హం. మూడుసార్లు మంచి ర్యాంకు సాధించలేక విఫలమైన ప్రఖర్.. నాలుగో సారి మరింత కష్టపడి 90వ ర్యాంకు సాధించడం గమనార్హం. మరి ఈ యూపీఎస్సీ అనుభవాన్ని ప్రఖర్ మనతో ఇలా పంచుకున్నాడు.
లలితపూర్ కి చెందిన ప్రఖర్.. ఈ యూపీఎస్సీ పరీక్షలో 90వ ర్యాంక్ సాధించాడు. గతేడాది కూడా ప్రఖర్ కి 693వ ర్యాంకు వచ్చింది. అయితే.. అది అతనికి పూర్తిగా సంతృప్తినివ్వలేదు. అందుకే మరోసారి ప్రయత్నించి.. ఈ అద్భుతమైన ర్యాంకు సాధించాడు. గతేడాది డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ కేడర్ పొందాడు. ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత మళ్లీ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి.. ఈ సారి మంచి ర్యాంకు సాధించగలగడం విశేషం. ఇప్పుడు ఐఏఎస్ అయ్యాడు.
undefined
అతని తండ్రి రాకేష్ జైన్ కొత్వాలి సదర్ ప్రాంతంలోని నజైబజార్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. తల్లి గృహిణి. ముగ్గురు సోదరులలో పెద్దవాడైన ప్రఖర్ జైన్ కుటుంబ బాధ్యతలను నెరవేర్చడం ద్వారా తన విజయం వరకు ప్రయాణించాడు. ప్రఖర్ జైన్ తన ప్రాథమిక విద్యను SDS కాన్వెంట్ స్కూల్, లలిత్‌పూర్ నుండి పూర్తి చేసారు. మధ్యప్రదేశ్‌లోని విదిషాలోని న్యూ జైన్ హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి 12 వ తరగతి ఉత్తీర్ణత సాధించాడు.అతను 2016 లో కాన్పూర్ IIT నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసాడు. గ్రాడ్యుయేషన్ తరువాత, అతను గుర్గావ్‌లోని ఒక కంపెనీలో ఉద్యోగం పొందాడు, కానీ ఆ ఉద్యోగం కన్నా.. సివిల్స్ పూర్తి చేయడమే తన ముందు ఉన్న లక్ష్యంగా ఆయన భావించడం గమనార్హం.
నాలుగో ప్రయత్నంలో తాను ఐఏఎస్ అయ్యానని ప్రఖర్ జైన్ చెప్పారు. అతను మూడవ ప్రయత్నంలో 693 వ ర్యాంక్ సాధించాడు, దాని కారణంగా అతనికి డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ కేడర్ లభించింది. కానీ అతను సర్వీస్ నుండి సెలవు తీసుకున్న తర్వాత సిద్ధం కావడం మంచిదని అనుకున్నాడు.
తనకు చదువుపై ఎప్పుడూ ఆసక్తి ఉండేదని ప్రఖర్ చెప్పాడు. పాఠశాలలో చదివినా, ఏదైనా పోటీలోనూ ఎప్పుడూ ముందుండేవాడు. అతనికి కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించింది. దానివల్ల చదువుపై దృష్టి నిలిచింది. అతను 2016 లో కాన్పూర్ ఐఐటి నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బిటెక్ చేసారు.
నాలుగుసార్లు తాను యూపీఎస్సీ పరీక్షకు ప్రయత్నించానంటూ కేవలం తన కుటుంబం వల్లే అని అతను చెప్పడం విశేషం. ఒక్కోసారి ఇక చాలు అని తనకు అనిపించేదని కానీా.. తన తల్లిదండ్రులు మాత్రం తనకు ఎనలేని ధైర్యం ఇచ్చేవారని చెప్పాడు.
పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో ఒక్కోసారి నిరాశ కలిగేదని.. తాను మొదటి రెండు ప్రయత్నాల్లో కనీసం ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయానని చెప్పడం గమనార్హం. రెండోసారి తాను చాలా డీలా పడిపోయానని చెప్పారు. అయితే.. తన తమ్ముడు తనకు ధైర్యం ఇచ్చానని చెప్పాడు. తన తమ్ముడితో కలిసి చదువుతుండేవాడినని చెప్పాడు.
రెండుసార్లు ఫెయిల్ కావడంతో.. చాలా ఒత్తిడి ఉండేదని..కానీ ఇప్పుడు అనుకున్నది సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఆ ఒత్తిడి తగ్గించడానికి తన తమ్ముడు సహాయం చేశాడని చెప్పారు. ఇంటర్వ్యూ కోసం దాదాపు 7గంటలపాటు ఎదురు చూశానని ఆయన చెప్పడం విశేషం.