డిగ్రీ కోర్సుల్లో ఎంట్రన్స్ కోసం నోటిఫికేష‌న్‌ను విడుద‌ల..

Ashok Kumar   | Asianet News
Published : Aug 20, 2020, 04:54 PM ISTUpdated : Aug 20, 2020, 04:58 PM IST
డిగ్రీ కోర్సుల్లో ఎంట్రన్స్  కోసం నోటిఫికేష‌న్‌ను విడుద‌ల..

సారాంశం

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టిఎస్‌సిహెచ్‌ఇ) గురువారం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (డోస్ట్) 2020 నోటిఫికేషన్ జారీ చేసింది. 

హైదరాబాద్: తెలంగాణ‌ రాష్ట్రంలోని అన్నీ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న కళాశాలలు అందించే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టిఎస్‌సిహెచ్‌ఇ) గురువారం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (డోస్ట్) 2020 నోటిఫికేషన్ జారీ చేసింది.

నోటిఫికేషన్ ప్రకారం ఫేజ్ I ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 7 వరకు ఉంటాయి. రిజిస్ర్టేష‌న్ ప్ర‌క్రియ‌ కోసం రూ .200 ఫీజుతో చెల్లించాల్సి ఉంటుంది.

also read సెప్టెంబర్ 7న క్లాట్-2020 పరీక్ష.. త్వ‌ర‌లో అడ్మిట్ కార్డులు.. ...

మొదటి దశలో నమోదు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 8 మధ్య వెబ్ ఆప్షన్స్ ఉపయోగించూకోవాల్సి ఉంటుంది.

మొదటి దశ అడ్మిష‌న్ల‌కు సంబంధించి సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 16న జరుగుతుంది. సీట్లు కేటాయించిన విద్యార్థులు సెప్టెంబర్ 17 నుండి 22 వరకు సెల్ఫ్ గా ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకోవాలి.

మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్  https://www.tsche.ac.in/  పై క్లిక్ చేయండి.

PREV
click me!

Recommended Stories

Business Ideas : ఉద్యోగం చేస్తూనే ఈ సైడ్ బిజినెస్ చేశారో.. నెలనెలా వేలల్లో ఎక్ట్రా ఇన్కమ్ పక్కా..!
UPSC Interview Questions : నిత్యం మండుతూనే ఉంటుంది, కానీ బూడిద ఉండదు.. ఏమిటది?