రూ.1,80,000 వరకు జీతం! కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగాల భర్తీ

NHPC లిమిటెడ్ లో ట్రైనీ అధికారులు (HR, PR, లీగల్), సీనియర్ మెడికల్ ఆఫీసర్‌తో సహా 118 ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే ఏ అర్హతలు కలిగివుండాలంటే... 

Google News Follow Us

NHPC (National Hydroelectric Power Corporation)  లిమిటెడ్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికే వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ట్రైనీ ఆఫీసర్ (HR, PR, లీగల్),  సీనియర్ మెడికల్ ఆఫీసర్‌తో సహా 118 పోస్టులను భర్తీ చేయనున్నారు.  అర్హత కలిగిన అభ్యర్థులు NHPC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

NHPC లిమిటెడ్ ఖాళీల వివరాలు

 పోస్టు పేరుఖాళీల సంఖ్య జీతం
ట్రైనీ ఆఫీసర్ (HR)                 71 ₹ 50,000 –  ₹ 1,60,000 
ట్రైనీ ఆఫీసర్ (PR)                10 ₹ 50,000 – ₹1,60,000 
ట్రైనీ ఆఫీసర్ (లీగల్)
 
                12 ₹50,000 –  ₹ 1,60,000 
సీనియర్ మెడికల్ ఆఫీసర్                25 ₹60,000 - ₹1,80,000 

విద్యార్హతలు:
ట్రైనీ ఆఫీసర్ (HR) పోస్టుకు దరఖాస్తు చేయడానికి HR/పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్‌లో 60% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ట్రైనీ ఆఫీసర్ (PR) పోస్టుకు దరఖాస్తు చేయడానికి మాస్ కమ్యూనికేషన్/జర్నలిజంలో 60% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ట్రైనీ ఆఫీసర్ (లీగల్) పోస్టుకు దరఖాస్తు చేయడానికి 60% మార్కులతో లా డిగ్రీ (LLB) పూర్తి చేసి ఉండాలి.
సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు MBBS డిగ్రీ మరియు 2 సంవత్సరాల ఇంటర్న్‌షిప్ అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు : 
 EWS, OBC  కేటగిరీ అభ్యర్థులు ₹600 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, PwBD, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంది.
అర్హత కలిగిన అభ్యర్థులు NHPC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వారు తమ UGC NET, CLAT లేదా MBBS సర్టిఫికెట్‌లను ఉపయోగించి నమోదు చేసుకోవాలి, స్కాన్ చేసిన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి,అన్ని వివరాలు సరైనవని నిర్ధారించుకోవాలి.

చివరి తేదీ: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 30, 2024. డిసెంబర్ 30న సాయంత్రం 5:00 గంటలకు ఆన్‌లైన్ పోర్టల్ మూసివేయబడుతుంది.