బీటెక్‌, బీఫార్మా, ఎంబీఏ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. వివరాల కోసం క్లిక్ చేయండి

By Sandra Ashok Kumar  |  First Published Sep 1, 2020, 5:28 PM IST

తాజా సమాచారం ప్రకారం జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ-హైదరాబాద్ (జెఎన్‌టియు-హెచ్) బిటెక్ / బిఫార్మ్, ఎంబీఏ చివరి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 16 నుండి ప్రారంభం కానున్నాయి.


హైదరాబాద్: లాక్ డౌన్ సడలింపుతో వాయిదా పడ్డ  బీటెక్‌, బీఫార్మా, ఎంబీఏ పరీక్షల కోసం తేదీలను ఖరారు చేసింది. ఎప్పటిలాగా కాకుండా ఈసారి ప్రశ్నపత్రం లో మార్పులు, పరీక్ష సమయాన్ని కుదించారు.

తాజా సమాచారం ప్రకారం జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ-హైదరాబాద్ (జెఎన్‌టియు-హెచ్) బిటెక్ / బిఫార్మ్, ఎంబీఏ చివరి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 16 నుండి ప్రారంభం కానున్నాయి.

Latest Videos

undefined

జెఎన్‌టియు-హెచ్ సెప్టెంబర్ 16 నుండి 25 తేదీలలో బిటెక్ / బిఫార్మ్ 4 సంవత్సరం  సెకండ్ సెమిస్టర్, ఎంబీఏ రెండవ  సంవత్సర  సెకండ్ సెమిస్టర్ కోసం రెగ్యులర్ / సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

also read 

బిటెక్ కోర్సులు, బిఫార్మ్, ఎంబీఏ రెండవ సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి.

బీటెక్ కోర్సులు-ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీలకు పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహించనున్నారు.

ముందే నిర్ణయించినట్లు, పరీక్ష వ్యవధిని మూడు గంటల నుండి రెండు గంటలకు తగ్గించారు. పరీక్ష సమయ వ్యవధిలో తగ్గింపును భర్తీ చేయడానికి, జెఎన్‌టియు-హెచ్ ప్రశ్నపత్రం నమూనాను ఎనిమిది ప్రశ్నలను ఐదుగా మార్చి పరీక్షల్లో పార్ట్-ఎను తొలగించింది.

పరీక్ష సమయంలో కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నారు.

click me!