BSF Recruitment: బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. టెన్త్/ఇంటర్‌ అర్హత ఉంటే చాలు..

By asianet news telugu  |  First Published Jun 13, 2022, 4:29 PM IST

బోర్ట‌ర్ సెక్యురిటీ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగవచ్చు. ఆసక్తిగ‌ల వారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకొండి.


ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్‌న్యూస్‌. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ (BSF)కు చెందిన వాటర్‌ వింగ్‌ ఆఫ్‌ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో ఎస్సై, ఇతర పోస్టుల (SI Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 281
పోస్టుల వివరాలు:
ఎస్సై పోస్టులు (Master, Driver, Work Shop): 16
హెచ్‌సీ పోస్టులు (Master, Engine Driver): 135
సీటీ పోస్టులు (Work Shop, Crew): 130
జీతం: నెలకు రూ.21,700 నుంచి రూ.1,12,400 వరకు చెల్లిస్తారు.

Latest Videos

undefined

వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 22 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హత: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులు/మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులు/మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:
గ్రూప్‌ ‘బీ’ పోస్టులకు: రూ.200
గ్రూప్‌ ‘సీ’ పోస్టులకు: రూ.100
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ ఇతర అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి జూన్‌ 23 వరకు.

click me!