ఇక నుంచి తెలుగులో బ్యాంక్ పరీక్ష

By telugu team  |  First Published Jul 4, 2019, 1:02 PM IST

బ్యాంక్ ఉద్యోగం సంపాదించాలని ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నారా..? అయితే ఈ శుభవార్త మీ కోసమే. ఇక నుంచి బ్యాంక్ ఉద్యోగాల పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. 


బ్యాంక్ ఉద్యోగం సంపాదించాలని ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నారా..? అయితే ఈ శుభవార్త మీ కోసమే. ఇక నుంచి బ్యాంక్ ఉద్యోగాల పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ గురువారం లోక్ సభలో ప్రకటించారు. బీఎస్ఆర్ బీ ఇకపై 13 ప్రాంతీయ భాషల్లో బ్యాంకు పరీక్షలు నిర్వహించనుంది.  ఆ 13 భాషల్లో తెలుగు కూడా ఉంది. 

ప్రస్తుతం ఆంగ్లం, హిందీ భాషల్లోనే బ్యాంకు పరీక్షలు రాసే అవకాశం ఉంది. దీని వల్ల ప్రాంతీయ భాషల్లో చదువు పూర్తిచేసిన వారికి పరీక్ష రాయడం కాస్త కష్టంగా ఉండేది. ఆంగ్లం అర్థం కాకపోవడం వల్ల కూడా కొందరు అభ్యర్థులు పరీక్షల్లో విఫలమవుతున్నారు. తాజా నిర్ణయంతో ఈ అభ్యర్థులకు మేలు జరగనుంది. ముఖ్యంగా తెలుగు మీడియం నుంచి వచ్చే విద్యార్థులకు ప్రశ్నలు మరింత సులువుగా అర్థమవుతాయి. 

Latest Videos

click me!