బ్యాంక్‌ ఉద్యోగాల నోటిఫికేషన్ గడువు పొడిగింపు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ

By Sandra Ashok Kumar  |  First Published Oct 24, 2020, 4:58 PM IST

గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ గడువు గతనెలతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దరఖాస్తు చేసుకోని అభ్యర్ధుల కోసం ఐబీపీఎస్‌ మరో అవకాశం కల్పించింది.


బ్యాంక్‌ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూతున్నారా అయితే నిరుద్యోగల కోసం ఐబీపీఎస్ గొప్ప అవకాశాన్ని ప్రకటించింది. గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ గడువు గతనెలతో ముగిసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా దరఖాస్తు చేసుకోని అభ్యర్ధుల కోసం ఐబీపీఎస్‌ మరో అవకాశం కల్పించింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్‌ నెల 26 నుంచి నవంబర్‌ 9వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించింది.   దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కోసం https://ibps.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Latest Videos

undefined

దేశవాప్తంగా ఉన్న 43 గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ల నియామకాలకు ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో 836 పోస్టులకి ఏపీ 366, తెలంగాణలో 470 కేటాయించారు.

మొత్తం పోస్టుల ఖాళీలు సంఖ్య : 9640
ఆఫీస్ అసిస్టెంట్‌(మ‌ల్టీప‌ర్ప‌స్‌)- 4624
ఆఫీస‌ర్‌(అసిస్టెంట్ మేనేజ‌ర్‌)- 3800
అగ్ర‌క‌ల్చ‌ర్ ఆఫీస‌ర్‌- 100
మార్కెటింగ్ ఆఫీస‌ర్‌- 08
ట్రెజ‌రీ మేనేజ‌ర్‌- 03
లా ఆఫీస‌ర్‌- 26
చార్టెడ్ అకౌంటెంట్‌- 26

also read 
ఐటీ ఆఫీస‌ర్‌- 58
జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌- 837
ఆఫీస‌ర్‌ (స్కేల్‌-3)- 156


అర్హత: పోస్టులను బట్టి అర్హతలను నిర్ణయించారు. కొన్ని పోస్టులకు బ్యాచిలర్‌ డిగ్రీ, మరికొన్ని పోస్టులకు సీఏలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక చేసే విధానం: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) ఉద్యోగాలను కేటాయిస్తారు. స్కేల్ - 1 ఆఫీసర్లకు రెండు దశల్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. స్కేల్ -2, 3 ఆఫీసర్లకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వాటిలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్‌సి, ఎస్‌టి, పీడబ్ల్యూడీలకు రూ.175, మిగిలిన వారికి రూ.850.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 26 అక్టోబర్‌  2020
దరఖాస్తుకు చివరితేది: 9 నవంబర్‌ 2020
ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీలు: ఆఫీసర్‌ పోస్టులకు 31 డిసెంబర్‌  2020, ఆఫీసర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 2021 జనవరి 2, 4 తేదీల్లో జరుగుతాయి.

click me!