BOB SO Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ బ్యాంకు అయిన Bank OF Baroda పలు పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్, MSME, కార్పొరేట్ క్రెడిట్ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులను కోరింది. గరిష్ట వేతనం 89 వేలుగా ఉంది.
BOB SO Recruitment 2022: కేంద్ర ప్రభుత్వం బ్యాంకులో ఉద్యోగం కోసం వెతుకుతున్న యువతకు ఇది నిజంగానే శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) పలు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB SO Recruitment 2022 ) ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్, MSME, కార్పొరేట్ క్రెడిట్ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులను కోరింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 24గా నిర్ణయించారు.
అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు నేరుగా ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక్కడ క్లిక్ చేసి అధికారిక నోటిఫికేషన్ BOB SO Recruitment 2022ను తనిఖీ చేయవచ్చు. ఈ ప్రక్రియలో మొత్తం 105 పోస్టులు భర్తీ చేయనున్నారు.
BOB SO Recruitment 2022 కోసం ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 04 మార్చి 2022
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ - 24 మార్చి 2022
BOB SO Recruitment 2022 కోసం ఖాళీ వివరాలు
మేనేజర్ – డిజిటల్ ఫ్రాడ్ (ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్) – 15
క్రెడిట్ ఆఫీసర్ (MSME డిపార్ట్‌మెంట్) SMG/S IV – 15
క్రెడిట్ ఆఫీసర్ (MSME డిపార్ట్‌మెంట్) MMG/S III – 25
క్రెడిట్ – ఎగుమతి / దిగుమతి వ్యాపారం (MSME విభాగం) SMG/SIV – 8
క్రెడిట్ – ఎగుమతి/దిగుమతి వ్యాపారం (MSME విభాగం) MMG/SIII – 12
ఫారిన్ ఎక్స్ఛేంజ్ – అక్విజిషన్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్ డిపార్ట్‌మెంట్) MMG/SIII – 15
విదేశీ మారకం – అక్విజిషన్ & రిలేషన్షిప్ మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్ డిపార్ట్‌మెంట్) MMG/SII – 15
BOB SO Recruitment 2022 వివిధ పోస్టుల కోసం విద్యార్హతలు ఇవే..
మేనేజర్ – డిజిటల్ ఫ్రాడ్ (ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్) – కంప్యూటర్ సైన్స్/ఐటీ/డేటా సైన్స్‌లో బీఈ/బీటెక్ లేదా కంప్యూటర్ సైన్స్/ఐటీలో గ్రాడ్యుయేట్, బ్యాంకింగ్ రంగంలో ఐటీ/డిజిటల్ సెక్టార్‌లో పనిచేసిన 3 ఏళ్ల అనుభవం ఉండాలి.
క్రెడిట్ ఆఫీసర్ (MSME డిపార్ట్‌మెంట్) SMG/S IV –
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా CA/CMA/CFA. క్రెడిట్ ఏజెన్సీలో కనీసం 8 సంవత్సరాల అనుభవం లేదా RBI ఆమోదించిన రేటింగ్ ఏజెన్సీలలో విశ్లేషకులుగా కనీసం 7 సంవత్సరాల అనుభవం ఉండాలి.
క్రెడిట్ ఆఫీసర్ (MSME డిపార్ట్‌మెంట్) MMG/S III –
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా CA/CMA/CFAలో కనీసం 5 సంవత్సరాల అనుభవం లేదా RBI ఆమోదించిన రేటింగ్ ఏజెన్సీలలో విశ్లేషకులుగా కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
క్రెడిట్ - ఎగుమతి/దిగుమతి వ్యాపారం (MSME డిపార్ట్‌మెంట్) SMG/SIV-
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా భారతదేశంలోని ఏదైనా బ్యాంక్/NBFC/ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లలో కనీసం 8 సంవత్సరాల ఎగుమతి/దిగుమతి క్రెడిట్ అసెస్‌మెంట్‌తో CA/CMA/CFA కలిగి ఉండి అనుభవం కలిగి ఉండాలి.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ - అక్విజిషన్ & రిలేషన్షిప్ మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్ డిపార్ట్‌మెంట్) MMG/SIII -
గ్రాడ్యుయేట్ (ఏదైనా విభాగంలో) , మార్కెటింగ్/సేల్స్‌లో స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండి, ఫారెక్స్‌లో సేల్స్/రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్‌లో 4 సంవత్సరాల ఎక్స్‌పోజర్‌తో 5 సంవత్సరాలు ఉండాలి. పబ్లిక్/ప్రైవేట్/విదేశీ బ్యాంకుల్లో పని అనుభవం ఉండాలి.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ - అక్విజిషన్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్ డిపార్ట్‌మెంట్) MMG/SII -
గ్రాడ్యుయేట్ (ఏదైనా విభాగంలో), మార్కెటింగ్/సేల్స్‌లో స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి. పబ్లిక్/ప్రైవేట్/విదేశీ బ్యాంకులలో 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. ఫారెక్స్‌లో సేల్స్/రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్‌లో 2 సంవత్సరాల అనుభవం.
BOB SO Recruitment 2022 కోసం వయో పరిమితి
మేనేజర్ – డిజిటల్ ఫ్రాడ్ (ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్) – 24 నుండి 34 సంవత్సరాలు
క్రెడిట్ ఆఫీసర్ (MSME డిపార్ట్‌మెంట్) SMG/S IV - 28 నుండి 40 సంవత్సరాలు
క్రెడిట్ ఆఫీసర్ (MSME డిపార్ట్‌మెంట్) MMG/S III - 25 నుండి 37 సంవత్సరాలు
క్రెడిట్ - ఎగుమతి/దిగుమతి వ్యాపారం (MSME విభాగం) SMG/SIV - 28 నుండి 40 సంవత్సరాలు
క్రెడిట్ – ఎగుమతి/దిగుమతి వ్యాపారం (MSME విభాగం) MMG/SIII – 25 నుండి 37 సంవత్సరాలు
ఫారిన్ ఎక్స్ఛేంజ్ - అక్విజిషన్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్ డిపార్ట్‌మెంట్) MMG/SIII - 26 నుండి 40 సంవత్సరాలు
ఫారిన్ ఎక్స్ఛేంజ్ – అక్విజిషన్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్ (కార్పొరేట్ క్రెడిట్ డిపార్ట్‌మెంట్) MMG/SII – 24 నుండి 35 సంవత్సరాలు
BOB SO Recruitment 2022 కోసం దరఖాస్తు రుసుము
SC/ ST/ వికలాంగులు (PWD)/ స్త్రీ – రూ. 100/-
జనరల్/OBC/EWS- రూ.600/-
BOB SO Recruitment 2022 కోసం వేతనం స్కేలు ఇదే..
MMGS II: రూ. 48170 x 1740 (1) – 49910 x 1990 (10) – 69180
MMGS III: రూ. 63840 x 1990 (5) – 73790 x 2220 (2) – 78230
SMG/S-IV : రూ. 76010 x 2220 (4) – 84890 x 2500 (2) – 89890
BOB SO Recruitment 2022 కోసం ఎంపిక ప్రక్రియ
ఆన్‌లైన్ పరీక్ష
గ్రూప్ డిస్కషన్ (GD) / పర్సనల్ ఇంటర్వ్యూ (PI) / సైకోమెట్రిక్ టెస్ట్