కేవలం ఐటీఐ అర్హతతో కేంద్రప్రభుత్వ ఉధ్యోగం, ఆన్ లైన్ ద్వారా ఇలా అప్లై చేసుకోవచ్చు..నెలకు వేతనమో ఎంతో తెలుసా...

By Krishna Adithya  |  First Published Oct 13, 2022, 1:03 AM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా అయితే నాసిక్ లోని ఇండియా సెక్యూరిటీ ప్రైస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా, అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరుద్యోగుల కలను నెరవేర్చేందుకు అనేక కేంద్ర ప్రభుత్వం సంస్థలు, విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇప్పటికే రైల్వేలు, రక్షణ శాఖతో పాటు బ్యాంకులు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జోరుగా రిక్రూట్ మెంట్ ప్రక్రియ ఊపందుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ లో జూనియర్ టెక్నికల్ స్టాఫ్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 

భారతదేశంలోని మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న ఇండియా సెక్యూరిటీ ప్రెస్, జూనియర్ టెక్నికల్ స్టాఫ్ ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Latest Videos

undefined

ముఖ్యమైన తేదీలు ఇవే:

నోటిఫికేషన్: 08.10.2022

ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 08.11.2022

వ్రాత పరీక్ష తేదీ: 2022 డిసెంబర్/ 2023 జనవరి

ఖాళీలు: 85

ఇందులో వికలాంగులకు ఒక సీటు, మాజీ సైనికులకు ఎనిమిది సీట్లు రిజర్వేషన్‌ కింద రిజర్వ్ చేయబడ్డాయి.

విద్యార్హత:  స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (SCVT), సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా గుర్తింపు పొందిన సంబంధిత రంగాలలో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి:  08.11.2022 నాటికి దరఖాస్తుదారుల వయస్సు 25 కంటే తక్కువ మరియు 18 ఏళ్లు పైబడి ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగలు నిర్దేశిత వయోపరిమితి కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 5 సంవత్సరాల వరకు వయో సడలింపుకు అర్హులు. ఈ వర్గీకృత తరగతులు మూడేళ్ల వరకు వయో సడలింపుకు అర్హులు.

ఎలా దరఖాస్తు చేయాలి : ispnasik.spmcil.com దరఖాస్తును వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలి.

ఎంపిక ప్రక్రియ : రాత పరీక్షలో ప్రధాన మార్కుల ఆధారంగా తుది జాబితా తయారు చేయబడుతుంది.

పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి ఇండియా సెక్యూరిటీ ప్రెస్ Advt. నం. 02/2022

tags
click me!