షాకింగ్ : మహిళకు ఒకేసారి ఆరు డోసుల వ్యాక్సిన్.. !

By AN TeluguFirst Published May 11, 2021, 2:56 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్ కార్యక్రమం ఉదృతంగా కొనసాగుతోంది. ఇక మనదేశంలో అయితే మొదటి డోస్ వేసుకున్నవారికి రెండో డోస్ వ్యాక్సిన్ దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్ కార్యక్రమం ఉదృతంగా కొనసాగుతోంది. ఇక మనదేశంలో అయితే మొదటి డోస్ వేసుకున్నవారికి రెండో డోస్ వ్యాక్సిన్ దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ క్రమంలో ఇటలీలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఒకే మహిళకు వ్యాక్సిన్ ఆరు డోసులు ఇచ్చారు.  దీంతో ఆ మహిళ అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రిలో చేరింది. 24 గంటల పాటు ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందించిన తరువా డిశ్చార్జ్ చేశారు. ఇదెలా జరిగింది.. అంటే... 

ఇటలీలో 23 యేళ్ల ఓ మహిళ కరోనా వ్యాక్సిన్ కోసం ఆదివారం టుస్కనీలోని ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ హాస్పిటల్ లో హెల్త్ వర్కర్ అనుకోకుండా ఫైజర్ వ్యాక్సిన్ బాటిల్ లోని మెత్తం డోసులను ఆ మహిళకు ఇచ్చింది. అందులో ఆరు డోసులు ఉన్నాయి. 

మొదట ఈ పొరపాటును గమనించలేదు ఆ హెల్త్ వర్కర్. తరువాత చూస్తే మిగతా ఐదు సిరంజిలు ఖాళీగా ఉన్నాయి. దీంతో తాను చేసిన తప్పును గ్రహించింది. ఇంతలోనే ఆరు డోసులు తీసుకున్న మహిళ అనారోగ్యానికి గురైంది.

వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్చుకుని 24 గంటలు వైద్యుల పర్యవేక్షలో ఉంచుకున్నారు. ఆ తరువాత ఆమెలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడంతో ఆస్పత్రి నుంచి సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు.

అయితే ఆమెకు ఆ తరువాత ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందేమోనని నిత్యం పర్యవేక్షించేందుకు ఓ డాక్టర్ ను నియమించామని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. 

అంతేకాదు ఇది కావాలని చేసింది కాదని.. మానవ తప్పిదం వల్ల జరిగిన పొరపాటు మాత్రమేనని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. 
 

click me!