జ్వరం వచ్చిందని లీవ్ పెట్టి, ఫుట్ బాల్ మ్యాచ్ కు వెళ్లింది... ఉద్యోగం ఊడింది

By telugu news teamFirst Published Jul 16, 2021, 8:27 AM IST
Highlights

ఇటీవల యూరో ఛాంపియన్ షిప్ టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇటలీ విజేతగా నిలిచింది.

ఒంట్లో బాగోలేని సమయంలో.. విశ్రాంతి తీసుకోవడానికి మనకు ఉద్యోగ సంస్థలు సిక్ లీవ్ తీసకునే అవకాశం కల్పిస్తాయన్న విషయం మనకు తెలిసిందే. కాగా... ఓ మహిళ.. దానిని తన పర్సనల్ అవసరానికి వాడుకుంది. అబద్ధం చెప్పి సెలవు తీసుకొని.. ఫుట్ మ్యాచ్ చూడటానికి వెళ్లింది. చివరకు.. ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన యూకేలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యూకేలోని బ్రాడ్ ఫోర్డ్ కు చెందిన నైనా ఫారుకీ ఓ కంపెనీలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తోంది. ఆమెకు ఫుట్ బాల్ క్రీడలంటే చాలా ఇష్టం. ఇటీవల యూరో ఛాంపియన్ షిప్ టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇటలీ విజేతగా నిలిచింది.

ఫైనల్ కి ముందు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్, డెన్మార్క్ పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ చూడటానికి నైనా ఆఫీసుకు సెలవు పెట్టాలని అనుకుంది. మ్యాచ్ చూడటానికి అంటే.. లీవ్ ఇవ్వరని.. తనకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పి సిక్ లీవ్ పెట్టింది.

స్నేహితులతో కలిసి.. స్టేడియంలో సందడి చేసింది. ఆమె చేసిన సందడి, గోల అంతా.. టీవీల్లో కనపడింది. అంతే... ఆమె అబద్దం చెప్పిన విషయం కాస్త ఆఫీసులో తెలిసిపోయింది. ఇంకేముంది.. అబద్దం చెప్పిందని.. ఆమెను ఉద్యోగం లో నుంచి తీసేశారు. 

click me!