రష్యాలో విజృంభిస్తున్న కరోనా: ఒక్క రోజులోనే 652 మంది మృతి

By narsimha lodeFirst Published Jun 30, 2021, 9:37 AM IST
Highlights

రష్యాలో కరోనా  వైరస్ మరోసారి వ్యాప్తి చెందుతున్నట్టుగా కన్పిస్తోంది.  గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు రష్యాలో చోటు చేసుకొన్నాయి. రష్యాలో నిన్న  ఒక్క రోజే 652 మంది కరోనాతో మరణించారు. కరోనాతో ఇంత పెద్ద మొత్తంలో మరణించడం రష్యాలో ఇదే మొదటిసారి.

మాస్కో: రష్యాలో కరోనా  వైరస్ మరోసారి వ్యాప్తి చెందుతున్నట్టుగా కన్పిస్తోంది.  గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు రష్యాలో చోటు చేసుకొన్నాయి. రష్యాలో నిన్న  ఒక్క రోజే 652 మంది కరోనాతో మరణించారు. కరోనాతో ఇంత పెద్ద మొత్తంలో మరణించడం రష్యాలో ఇదే మొదటిసారి.

కరోనా వైరస్ కు రష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను ప్రపంచంలో తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. గత వారం రోజులుగా రష్యాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు 20 వేల పాజిటివ్ కేసులు నమోదౌతున్నాయి. 600లకుపైగా కరోనా మరణాలు చోటు చేసుకొంటున్నాయి.నిన్న ఒక్క రోజే 20,616 కరోనా కేసులు నమోదు కాగా, 652 మంది మరణించారని రష్యా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వ్యాక్సినేషన్ విషయంలో  రష్యా మందకొడిగా కొనసాగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. 14 శాతం మాత్రమే ఒక్క డోసు మాత్రమే తీసుకొన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో కరోనా వైరస్ ఉధృతి పెరిగిందని కేసుల సంఖ్యను బట్టి అర్ధమౌతోంది. కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రష్యాలో  ఇప్పటికే 55 లక్షల మంది కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 1.34 లక్షల  మంది కరోనాతో చనిపోయారు.

click me!