ప్రాణాలు తీస్తూ.. కాపురాలు కూలుస్తూ: ప్రపంచాన్ని ఊపేస్తున్న పబ్‌జీ

By Siva KodatiFirst Published May 2, 2019, 5:54 PM IST
Highlights

పబ్‌జీ గేమ్ ఆడొద్దన్నారని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మనం ప్రతి రోజు చూస్తూనే  ఉన్నాం. తాజాగా ఓ భర్త తన భార్యను పబ్‌జీ గేమ్‌ను ఆడొద్దన్నాడని విడాకులకు దరఖాస్తు చేసింది భార్య.

పబ్‌జీ గేమ్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తోంది. దీని మాయలో పడి జనాలు ప్రాణాలు పొగొట్టుకోవడంతో పాటు కాపురాలను  నాశనం చేసుకుంటున్నారు. పబ్‌జీ గేమ్ ఆడొద్దన్నారని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మనం ప్రతి రోజు చూస్తూనే  ఉన్నాం.

తాజాగా ఓ భర్త తన భార్యను పబ్‌జీ గేమ్‌ను ఆడొద్దన్నాడని విడాకులకు దరఖాస్తు చేసింది భార్య. వివరాల్లోకి వెళితే.. యూఏఈకి చెందిన ఓ మహిళ ప్రతి రోజు ఆన్‌లైన్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతుండటంతో భర్త ఆమెను ఆడొద్దని సూచించాడు.

దీంతో ఇద్దరి మాట మాటా మాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. చాట్ ఆప్షన్ యాక్టివేట్ చేయకుండా తన బంధువులు, స్నేహితులతో మాత్రమే గేమ్ ఆడుతున్నానని మహిళ పోలీసులకు తెలిపింది.

అలాగే తన భార్య నిత్యం ఇలా ఆటలో మునిగిపోవడంతో భార్యగా తన బాధ్యత, విధులను నిర్వహించకుండా ఉంటుందన్న భయంతోనే ఆడొద్దన్నాని తెలిపారు. అయినా గేమమ్ ఆడొద్దు అని అంటే తనకున్న వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం కాదని.. ఈ చిన్న విషయానికే తన భార్య విడాకులు అడగటం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. 
 

click me!