పర్సనల్ సెక్యూరిటీ గార్డ్‌ను పెళ్లి చేసుకొన్న థాయ్ రాజు

By narsimha lodeFirst Published May 2, 2019, 12:43 PM IST
Highlights

పట్టాభిషేకానికి కొన్ని రోజుల ముందే థాయ్‌లాండ్ రాజు వజిరలోంగుకోర్న్ బుధవారం నాడు తన వ్యక్తిగత సెక్యూరిటీ డిప్యూటీ హెడ్  సుతీంధ్రను వివాహం చేసుకొన్నారు. ఆమెను రాణి సుతీంధ్రగా ఆయన ప్రకటించారు.

బ్యాంకాక్: పట్టాభిషేకానికి కొన్ని రోజుల ముందే థాయ్‌లాండ్ రాజు వజిరలోంగుకోర్న్ బుధవారం నాడు తన వ్యక్తిగత సెక్యూరిటీ డిప్యూటీ హెడ్  సుతీంధ్రను వివాహం చేసుకొన్నారు. ఆమెను రాణి సుతీంధ్రగా ఆయన ప్రకటించారు.

బుధవారం నాడు రాయల్ గెజిట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. అంతేకాదు ఈ పెళ్లికి సంబంధించిన వీడియో పుటేజీని కూడ అందించారు. ఈ పెళ్లికి సంబంధించిన దృశ్యాలు కూడ కొన్ని మీడియా ఛానెల్స్‌ ప్రసారం చేశాయి.

వజిరలోంగుకోర్న్ వయస్సు 66.  ఆయనను  రామ x గా కూడ  పిలుస్తారు. తన తండ్రి రాజు భూమిబోల్ ఆధుల్యదేజ్ మరణించిన రాజుగా సింహాసనాన్ని అధిష్టించారు.  అయితే అతడు రాజుగా అధికారికంగా త్వరలో పట్టాభిషేకాన్ని చేసుకోనున్న తరుణంలో వివాహం చేసుకొన్నారు.

ఈ నెల 4వ తేదీన బుద్ధిస్ట్, బ్రహ్మిన్ సంప్రదాయాల ప్రకారంగా వజిరలోంగుకోర్న్‌కు కిరీట ధారణ చేయనున్నారు. ఆ తర్వా బ్యాంకాక్ పుర వీధుల్లో ఆయన ఊరేగనున్నారు.

సుతీంధ్రను వజిరలోంగుకోర్న్‌ 2014లో  థాయ్ ఎయిర్‌వేస్‌లో  ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసింది.  ఆ తర్వాత ఆమెను తన సెక్యూరిటీ విభాగంలో  డిప్యూటీ కమాండర్‌గా ఆయన నియమించుకొన్నారు.

అయితే వీరిద్దరి మధ్య సంబంధాల గురించి విదేశీ మీడియా పలు కథనాలు ప్రచురించింది. కానీ, ఈ విషయమై రాజ భవనం ఏనాడూ కూడ స్పందించలేదు.
 థాయ్ ఆర్మీకి సుతీంధ్రను రాజు 2016లో జనరల్‌గా నియమించారు. ఆ తర్వాత 2017 లో తన పర్సనల్ సెక్యూరిటీ విభాగంలో డిప్యూటీగా నియమించారు. 

ఈ పెళ్లికి థాయ్ మిలటరీ విభాగం అధిపతి జుంటాతో పాటు రాజ కుటుంబానికి చెందిన పలువురు హాజరయ్యారు.వజిరలోంగుకోర్న్‌‌కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ముగ్గురితో ఆయన విడాకులు తీసుకొన్నారు. మూడు పెళ్లీళ్లు చేసుకొన్న ఆయనకు ఏడుగురు పిల్లలున్నారు.  

click me!