WHO Alert: ‘కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయ్.. కట్టడి చర్యలు తీసుకోండి’

Published : Mar 16, 2022, 03:53 PM ISTUpdated : Mar 16, 2022, 04:55 PM IST
WHO Alert: ‘కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయ్.. కట్టడి చర్యలు తీసుకోండి’

సారాంశం

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా ఆంక్షలు ఎత్తేసిన ప్రాంతాల్లో ఈ కేసుల పెరుగుదల కనిపిస్తున్నదని వివరించింది. కరోనా టెస్టుల సంఖ్య తగ్గినా కేసులు ఎక్కువగా రిపోర్ట్ కావడం ఆందోళనకరం అని తెలిపింది.

న్యూఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేసులు మళ్లీ పెరుగుతున్నట్టు చైనా దేశపు వార్తలు చూశాం. అక్కడ అధిక సంఖ్యలో ప్రజలు లాక్‌డౌన్‌లో మగ్గుతున్నారని విన్నాం. ఇప్పుడు దక్షిణ కొరియాలోనూ కేసులు భారీగా పెరిగాయన్న కథనాలు వచ్చాయి. జనవరి చివరి వారంలో కరోనా కేసులు వెనుకపట్టు పట్టాయి. అప్పటి నుంచి కరోనా ఆంక్షలు క్రమంగా ప్రభుత్వాలు ఎత్తేశాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో తాజాగా మరోసారి ప్రపంచ దేశాలను తట్టిలేపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్-19 టెక్నికల్ లీడ్ మారియా వ్యాన్ ఖెర్కోవ్ స్పందించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన వారాల వ్యవధిలో మళ్లీ పెరుగుతున్నాయని ఆమె తెలిపారు. కరోనా టెస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ కేసులు ఎక్కువగా రిపోర్ట్ కావడం ఆందోళనకరం అని వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి బలంగా సాగుతున్నట్టు ఆమె అంచనా వేశారు. ముఖ్యంగా కరోనా ఆంక్షలు ఎత్తేసిన ప్రాంతాల్లో కేసులు విపరీతంగా రిపోర్ట్ అవుతున్నాయని ఆమె తన ట్వి్ట్టర్‌ ఖాతాలో వివరించారు.

టీకా పంపిణీ సమృద్ధిగా జరిగినా కరోనా ఆంక్షలు ఎత్తేస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేమని నిపుణులు ఇది వరకే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే.. టీకాలు కేవలం వైరస్ తీవ్రతతను తగ్గించగలవని, మరనాలను నివారించగలవని, కానీ, వైరస్ సోకకుండా అడ్డుకోలేవని మారియా వ్యాన్ ఖెర్కోవ్ మరోసారి గుర్తు చేశారు. 

కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లోనూ ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దాదాపుగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 సబ్ వేరియంట్ కేసులే అధికంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఎందుకంటే.. ఈ వేరియంట్ సహజంగానే వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉండటం దీనికి కారణం అని వివరించారు. గడిచిన 30 రోజుల్లో సేకరించిన స్పెసిమెన్స్‌లో అంటే.. 430,487 సీక్వెన్స్‌లలో 99.9 శాతం ఒమిక్రాన్ కేసులే అని వెల్లడించారు. ప్రస్తుతం వియత్నాం, దక్షిణ కొరియా, జర్మనీల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని వివరించారు. మార్చి 7 నుంచి 13 మధ్య వారం వ్యవధిలో కరోనా కేసుల్లో 8 శాతం పెరుగుదల కనిపించిందని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, ప్రభుత్వం బుధవారం నాడు COVID-19 వ్యాక్సినేషన్ కవరేజీని విస్తరిస్తూ.. 12-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించింది. అలాగే, 60 సంవత్సరాల వయస్సు పై బడిన వారికి బూస్టర్ డోసులు ఇవ్వడం కూడా నేడు ప్రారంభమైంది. 12-14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి ఇవ్వాల్సిన COVID-19 వ్యాక్సిన్ కోర్బెవాక్స్ ను హైదరాబాద్‌లోని బయోలాజికల్ ఎవాన్స్ సంస్థ తయారు చేసింది

తెలంగాణలో 12-14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు కోవిడ్-19 టీకా నిర్వహణ డ్రైవ్ బుధవారం ప్రారంభమైంది. ఖైరతాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్‌సి)లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పి హరీశ్‌ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హత ఉన్న 17 లక్షల మంది పిల్లలకు కార్బెవాక్స్ కోవిడ్ వ్యాక్సిన్ మోతాదును ఇవ్వ‌నున్నారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే