కోవిడ్ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో రియాక్షన్: అమెరికా స్పందన ఇదే

Siva Kodati |  
Published : Dec 20, 2020, 03:17 PM IST
కోవిడ్ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో రియాక్షన్: అమెరికా స్పందన ఇదే

సారాంశం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం మానవాళి వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో టీకాలు అభివృద్ధి దశలో వున్నాయి. ఇటీవల బ్రిటన్‌కు చెందిన ఫైజర్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ ఆ దేశ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం మానవాళి వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో టీకాలు అభివృద్ధి దశలో వున్నాయి.

ఇటీవల బ్రిటన్‌కు చెందిన ఫైజర్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ ఆ దేశ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

యూకే దారిలోనే పలు దేశ ప్రభుత్వాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ క్రమంలో అమెరికా, బ్రిటన్‌లలో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో దుష్ప్రభావాలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో అలర్జీ సమస్యలకు లోనైన వారికి రెండో డోసు వద్దంటూ అమెరికా సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకటించింది.

కోవిడ్ టీకా అనంతరం స్వల్ప అస్వస్థత కాకుండా.. ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సినంత స్థాయిలో ఆరోగ్య సమస్యలు తలెత్తితే రెండో డోసును తీసుకోవద్దంటూ వైద్య నిపుణులు సూచించారు.

వ్యాక్సినేషన్‌ వల్ల అలెర్జీ తలెత్తిన కేసుల్లో వైద్య నివేదికలను తాము పరిశీలిస్తున్నామని.. అలెర్జీలు ఉన్నవారు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే విషయంలో గైడ్‌లైన్స్‌ త్వరలోనే వెల్లడిస్తామన్నారు. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !