వ్యాక్సిన్ వేసుకున్నవారికి మాస్క్ అవసరం లేదా..?

By telugu news teamFirst Published Apr 28, 2021, 8:49 AM IST
Highlights

అమెరికాలో వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఇక నుంచి మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. కేవలం గుంపులుగా ఉన్న చోట మాత్రమే పెట్టుకోవాలంటూ అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన హెల్త్ అఫీషియల్స్ ప్రకటించారు.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. ఈ మహమ్మారితో పోరాడేందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు నెత్తీనోరు మొత్తుకుంటున్నారు. ఈ వ్యాక్సినేషన్ విషయంలో అమెరికా పూర్తిగా సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు.

అమెరికాలో వ్యాక్సిన్ ఎక్కువ మంది వేయించుకున్నారు. దీంతో కరోనా కేసులు అక్కడ తగ్గుముఖం పట్టినట్లే చెబుతున్నారు. కాగా... అమెరికాలో వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఇక నుంచి మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. కేవలం గుంపులుగా ఉన్న చోట మాత్రమే పెట్టుకోవాలంటూ అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన హెల్త్ అఫీషియల్స్ ప్రకటించారు.

ఈ మేరకు అమెరికా ప్రభుత్వం ఈమేరకు తాజా గైడ్ లైన్స్ విడుదల చేసింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోస్ లు వేసుకున్నవారు.. బయటకు వెళ్లొచ్చు.. తినొచ్చు... చిన్న చిన్న గ్యాథరింగ్స్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పడం విశేషం.

వ్యాక్సిన్ వేయించుకున్న వారు.. కరోనా భయంతో ఎలాంటి పనులు ఆపుకోవాల్సిన అవసరం లేదని.. అన్నీ చేసుకోవచ్చని అమెరికా ప్రభుత్వం చెప్పడం విశేషం.

వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా వారికి కావాలంటే.. మాస్క్ పెట్టుకోవచ్చని.. ఏదైనా పెద్ద ఈ వెంట్స్ కి, స్పోర్ట్స్ ఈ వెంట్స్ కి వెళ్లినప్పుడు పెట్టుకోవచ్చని చెబుతున్నారు. జనం తక్కువ ఉన్న చోట మాస్క్ అవసరమే లేదని చెప్పడం విశేషం. 

click me!